తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా కమర్షియల్ హిట్ కాలేదు..ఆ తర్వాత అఖిల్ నటించిన ‘హలో’ చిత్రం గత ఏడాది విడుదలై మంచి ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలోని యాక్షన్ స్టంట్స్ అందరి దృష్టినీ ఆకర్షించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటిని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ బాబ్ బ్రౌన్ కంపోజ్ చేశారు.
Image result for director vikram kumar twitter
‘హలో’ సూళ్ల పరంగా ఆశించినస్థాయి విజయాన్ని అందుకోకపోయినా, టేకింగ్ పరంగా .. అఖిల్ లుక్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది.అలాంటి ఈ సినిమా .. 'వరల్డ్ స్టంట్ అవార్డ్స్' లో 'బెస్ట్ యాక్షన్ ఫారిన్ ఫిల్మ్' కేటగిరిలో నామినేట్ అయింది. అందుకు తనకి చాలా గర్వంగా ఉందంటూ విక్రమ్ కుమార్ ట్వీట్ చేశారు.
Image result for director vikram kumar twitter
ఈ సినిమా ఈ కేటగిరిలో నామినేట్ అయినందుకు సహకరించిన వాళ్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు జర్మనీకి చెందిన ‘ప్లాన్-బి’, స్పెయిన్ చిత్రం ‘సోలో సె విప్ ఉన వెజ్’, రష్యన్ చిత్రం ‘రోడ్ టూ కావర్లి’, చైనాకు చెందిన ‘ఉల్ఫ్ వారియర్ 2’ వంటి చిత్రాలు ఈ క్యాటగిరీలో నామినేట్ అయ్యాయి.  కాగా, అఖిల్ హార్డ్ వర్క్ .. ఆయన అంకితభావం ఈ సినిమాను పైస్థాయికి తీసుకెళ్లాయని దర్శకులు విక్రమ్ కుమార్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: