తెలుగు రాష్ట్రాలో ఊహించని విధంగా విజయం సాధించి కలెక్షన్లు రాబడుతున్న చిత్రం ‘మహానటి’.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి జీవితక కథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ లో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర పోషించారు.  జెమినీ గణేషన్ గా దుల్కన్ సల్మాన్ నటించారు.  ఇతరు ముఖ్య పాత్రలో సమంత, విజయ్ దేవరకొండ నటించారు.  ఈ చిత్రంలో చాలా వరకు ప్రధాన పాత్రలో సీనియర్ నటులు నటించడం మంచి ప్లస్ పాయింట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Image result for bindu chandramouli
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో కొన్ని పాత్రలను తెరపై చూపించలేదని టాక్. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్వకత్వంలో రూపొందించిన ఈ సినిమా నిడివి చాలా పెద్దది. దీంతో, అన్ని పాత్రలను తెరపై చూపించడం వీలుకాకపోగా.. చివరి నిమిషంలో సినిమాలో చిత్రించిన కొన్ని కీలక పాత్రల సన్నివేశాలను సైతం తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే జెమినీ గణేషన్ రెండవ భార్య అయిన పుష్పవల్లి పాత్రను తొలగించారట. ఈ నేపథ్యంలో ఆ పాత్ర పోషించిన నటి బిందు చంద్రమౌళి సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మహానటి’ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఓ చక్కటి అనుభూతిని ఇచ్చిందని, తన పాత్రను సినిమా నుంచి తొలగించడం కొంచెం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసిందట.
Image result for MAHANATI
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో టాం టాం అయ్యింది. దాంతో ఆమె వ్యాఖ్యలపై మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం తన పాత్రలేదనే బాధను తన వ్యక్తిగత అకౌంట్లో పోస్ట్ పెట్టానే తప్ప.. సినిమా యూనిట్‌పై తాను ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. తన వాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించి మరీ రాశారని ఆమె పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: