బాలీవుడ్ కండల వీరుడు అప్ కమింగ్ మూవీ ‘రేస్ 3’ ట్రైలర్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాడు. సల్మాన్ ఖాన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, బాబి డియోల్, అనీల్ కపూర్ తారాగణంలో రెమో డిసౌజా డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘రేస్ 3’ ట్రైలర్‌ను మంగళవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు సల్లూభాయ్.యాక్ష‌న్‌..థ్రిల్ల‌ర్ హిందీ చిత్రం రేస్ 3.
Image result for రేస్ 3 ట్రైలర్
ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు రెమో డి.సౌజా.  ఈ చిత్రం జూన్ 15న విడుద‌ల కానుంది.   ఈ ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ సీన్స్ అదిరిపోయాయి.‘రేస్‌’ సీక్వెల్‌లో గత సినిమాల తరహాలోనే మూడోపార్టు కూడా భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో తెరకెక్కింది. ‘యే రేస్‌ జిందగికీ రేస్‌ హై.. కిసికీ జిందగీ లేకేహీ ఖతం హోగీ’ వంటి షార్ప్‌, క్రిస్పీ డైలాగులతో మోస్ట్‌ యాక‌్షన్‌ సీన్స్‌తో.. సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేసేలా ట్రైలర్‌ ఉంది.
salman khan starrer race 3 official trailer released
ఒక వ్యాపార కుటుంబం.. ఆ కుటుంబంలోని అంతర్గత కుట్రలు నేపథ్యంగా సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘ఫ్యామిలీ ఉంటే చాలు.. నీకు శత్రువులు అవసరం లేదు’ అని ట్రైలర్‌లో చూపించడం సినిమా థీమ్‌ ఏంటో చెప్పకనే చెప్తోంది. రెమో డిసౌజా డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘రేస్ 3’ ట్రైలర్‌ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: