తెలుగు ఇండస్ట్రీలో మొన్నటి వరకు రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాల పేర్లు మారు మోగాయి. కలెక్షన్ల పరంగా కూడా ఈ రెండు చిత్రాలు బీభత్సం సృష్టించాయి.  తాజాగా నాగ్ అశ్వన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో ‘మహానటి’ తెరకెక్కించారు.   ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు సాధిస్తుంది.
Image result for mahanati
విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి 'మహానటి' సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసే పనిలో వుంది. ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి .. అటు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ఈ సినిమా టీమ్ కి ప్రశంసలు లభిస్తున్నాయి. అంతే కాదు ఓవర్సీస్ లో కూడా మహానటి కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
Related image
ఇప్పటికే ఈ చిత్ర బృందాన్ని పలువురు సన్మానించగా తాజాగా మంచు ఫ్యామిలీ తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. మోహన్ బాబు .. విష్ణు .. లక్ష్మి కలిసి దర్శక నిర్మాతలను అభినందిస్తూ సత్కరించారు.
Image result for mahanati mohan babu
ఈ సినిమాలో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో.. అది సాధించిన విజయంలో తనని కూడా భాగం చేసినందుకు మోహన్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.   అంతకు ముందు  ఈ సినిమా టీమ్ ను చిరంజీవి.. అల్లు అరవింద్ సత్కరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: