తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా సినీ తారపై వచ్చిన బయోపిక్ చిత్రం ‘మహానటి’.  అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని..ఎంతో రీసర్చ్ చేసి యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’.  ఎక్కడా ఎలాంటి వివాదానికి తావివ్వకుండా ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దారు.  ఇక సావిత్రి పాత్రలో మళియాళ బ్యూటి కీర్తి సురేష్ నటించడం కంటే జీవించిందనే చెప్పాలి. 

Image result for mahanati

ప్రతి సీన్ లోనూ సావిత్రిని మరిపించింది..అందుకే ఆమె నటనకు ఇటు ఇండస్ట్రీల అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.  ఇక మహానటి రిలీజ్ కంటే ముందు తెలుగు టాప్ హీరోలు రాంచరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ , అల్లు అర్జున్  ‘నా పేరు సూర్య’ లాంటి చిత్రాలతో పోటీ పడుతూ..‘మహానటి’ అద్భుతంగా దూసుకు పోతుంది.  

Image result for mahanati

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ మొత్తం ఈ సినిమాను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 రోజుల్లో రూ.10.52 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 7 రోజుల్లో 19.62 కోట్లు షేర్ ని వసూల్ చేసింది. ఏరియా వైజ్ వివరాలు మీకోసం.

నిజాం 4.85

సీడెడ్ 0.93

నెల్లూరు 0.26

కృష్ణ 1.03

గుంటూరు 0.83

వైజాగ్ 1.34

ఈస్ట్ గోదావరి 0.76

వెస్ట్ గోదావరి 0.52

టోటల్ (ఏపీ & టీఎస్) 10.52

రెస్ట్ అఫ్ ఇండియా 1.60

ఓవర్సీస్ 7.50

టోటల్ (వరల్డ్ వైడ్) 19.62



మరింత సమాచారం తెలుసుకోండి: