మాస్ మహారాజా గా అభిమానుల చేత పిలిపించుకునే రవితేజ ఆమధ్య వరుస పరాజయాలతో సతమతమైన పరిస్థుతుల మధ్య గత సంవత్సరం వచ్చిన రాజా ది గ్రేట్‌’ చిత్రంలో అంధుడి పాత్రను బాగా పోషిచడంతో పాటు ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో రవితేజ ట్రాక్ లో పడుతున్నాడు అని అనుకున్నారు అంతా. అయితే ఆతరువాత వచ్చిన  'టచ్‌ చేసి చూడు' చిత్రం ఫెయిల్ కావడంతో మళ్ళీ  రవితేజ తన పాత ధోరణిలోకి వెళ్లిపోయాడు అన్న కామెంట్స్ వచ్చాయి. 
RAVITEJA IN NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఆమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారిన తరువాత లేటెస్ట్ గా రవితేజ నటిస్తున్న  'నేలటిక్కెట్టు' సినిమాతో అయినా మాస్ మహారాజ తన మార్కు నుండి బయటకు వస్తాడు అని భావించారు. అయితే ఈమూవీ లేటెస్ట్ ట్రైలర్ ఏమాత్రం క్లిక్ కాకపోడం ఈమూవీ బయ్యర్లను కలవర పెడుతున్నట్లు సమాచారం.   
RAVITEJA IN NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే ఈమూవీ ఆడియో పెద్దగా క్లిక్‌ కాక పోవడంతో ఈమూవీ ట్రైలర్ ను చూసి అయినా ఈమూవీ పై క్రేజ్ పెరుగుతుంది అని ఈమూవీ బయ్యర్లు ఆశించారు. అయితే ఈమూవీ ట్రైలర్‌ చూసిన నెటిజన్లు 'మాస్‌ మహారాజ్‌' ని 'మూస మహారాజ్‌' అంటూ సెటైర్లు వేస్తున్నారు. 2నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రయిలర్ లో కొత్తగా అనిపించిన అంశం ఒక్కటి కూడా లేక పోవడంతో ఇలాంటి సెటైర్లు పడుతున్నాయి.  
RAVITEJA IN NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
హీరో తన కామెడీ గ్యాంగ్ తో కలిసి  హీరోయిన్ వెంటాడటం ఇంతలో విలన్ ఎంటర్ కావడం ఇలాంటి రొటీన్ సీన్స్ కు చిరునామాగా ఉండే మూస సినిమాలలో భాగంగానే ఈ ‘నేలటిక్కెట్టు’ కూడ మారబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  దీనితి ఈ ట్రయిలర్ ను చూస్తుంటే కళ్యాణ్ కృష్ణ ఏం చెప్పి రవితేజాను ఒప్పించాడు అంటూ చాలమంది కామెంట్స్ చేస్తున్నారు.  దీనితో ఈనెల 25న థియేటర్లలోకి రాబోతున్న ఈమూవీ విజయం సాధించడం కష్టం అన్న ప్రచారం అప్పుడే మొదలైపోయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: