కలక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న ‘మహానటి’ తో నిర్మాత అశ్వినీదత్ తిరిగి ట్రాక్ పైకి వచ్చాడు. గత కొంతకాలంగా వరస పరాజయాలతో సతమతమైపోయిన అశ్వినీదత్ ‘మహానటి’ జోష్ తో తన కొత్త సినిమాల వేగం కూడ పెంచుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఈనిర్మాత నిర్మిస్తున్న నాగార్జున నానీల మల్టీ స్టారర్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ లీక్ అయింది. 
సంబంధిత చిత్రం
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ నిర్మాణం చాల వరకు పూర్తి అయింది. వినోదంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్న ఈమూవీని మొదట్లో ఆగష్టులో విడుదల చేయాలి అని అనుకున్నారు. అయితే ఇప్పుడు వారి ఆలోచనలు మార్చుకుని సెప్టెంబర్ 12న విడుదల చేయడానికి రిలీజ్ డేట్ లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే సెప్టెంబర్ 12 బుధవారం వచ్చింది అయితే ‘మహానటి’ సినిమా బుధవారం విడుదల అయినా సూపర్ హిట్ అయిన నేపధ్యంలో అదే సెంటిమెంట్ ను అశ్వినీదత్ నాగార్జున నానీల మల్టీస్టారర్ పై కూడ ప్రయోగిస్తున్నట్లు టాక్. దీనికితోడు సెప్టెంబర్ 13న వినాయకచవితి కూడ రావడంతో వరస సెలవులు వస్తాయి కాబట్టి అశ్వినీదత్ తన మూవీకి ఈ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  
NANI ALONG WITH NAGARJUNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీలో నాగార్జున నానీల మధ్య వారి పాత్రలకు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ బాగా వచ్చిన నేపధ్యంలో వినాయకచవితిని దృష్టిలో పెట్టుకుని ఒక భారీ సెట్ లో నాగ్ నానీల పై వినాయకచవితి పాటను ఒక మాస్ ట్యూన్ తో పెడుతున్నట్లు సమాచారం. ‘మహానటి’ సూపర్ హిట్ కావడంతో ఈమూవీకి కూడ బయ్యర్ల నుండి మంచి ఆఫర్లు అశ్వినీదత్ కు వస్తున్నట్లు టాక్. ఏది ఏమైనా ‘మహానటి’ అన్ని విధాల అశ్వినీదత్ కు కలిసి వచ్చింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: