ఆ మద్య నాగార్జున హీరోగా ‘రక్షకుడు’ చిత్రంతో హీరోయిన్ గా నటించిన సుస్మితా సేన్ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించింది.  ఈ మద్య సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి.  అంతే కాదు దేశంలో మహిళలపై విపరీతంగా లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి.  దౌర్భాగ్యం ఏంటంటే..వేదింపులకు గురి చేసేవారిలో మైనర్ల నుంచి ముదుసలి వరకు తయారయ్యారు.   చిన్నారులని కూడా చూడకుండా అత్యాచారాలకు వడిగడుతున్నారు. 
Image result for susmita sen
సామాన్య మహిళలకే కాదు కొంత కాలంగా సెలబ్రెటీలు కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి.  ఆ మద్య మళియాళ నటి భావనను ఆమె డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగిక దాడి జరిపారు.  దీనిపై ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసి వారిని..వారి వెనుక ఉన్నవారందరికీ శిక్ష పడేలా చేసింది.  ఆమె స్ఫూర్తితో ఎంతో మంది నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి తెలిపారు.  తాజాగా సుస్మితాసేన్ తనపై లైంగిక వేధింపు జరిగిందని..అందునా  ఓ పదిహేళ్ల కుర్రాడు ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. 
Related image
ముంబైలో జరిగిన 'మేక్ యార్ సిటీ సేఫ్' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఘటన గురించి వివరించారు. '6 నెలల క్రితం నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఒక అవార్డుల ఫంక్షన్ లో ఓ కుర్రాడు నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ ప్రదేశమంతా రద్దీగా ఉండటంతో... ఎవరూ గుర్తించరని ఆ కుర్రాడు..తనను తాకరాని చోట తాకాడని..చేయి పట్టుకున్నాడని వెంటనే షాక్ కి గురైన నేను  అతని మెడను పట్టుకుని పక్కకు లాక్కెళ్లా.
Image result for susmita sen
నేను గొడవ చేసి, నీ గురించి అందరికీ చెబితే, నీ లైఫ్ ఏమవుతుందో తెలుసా? అని ప్రశ్నించా. దీంతో, అతను సారీ చెప్పాడు. మరోసారి ఇలా చేయనని అన్నాడు. దీంతో, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అతనిపై ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేశా' అని సుస్మిత తెలిపింది. అయితే, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకపోవడమే మంచిదని అభిప్రాయపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: