తెలుగు ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఈ మద్య కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చిత్రంలో సీఎం గా అదరగొట్టాడు. భారీ కలెక్షన్లలతో భరత్ అనే నేను రికార్డులు కొల్లగొడుతుంది.  ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.  ఆయన వచ్చిన తర్వాత  వంశీ పైడిపల్లి సినిమా కోసం ఇంతవరకు కనిపించని విధంగా కనిపించబోతున్నాడంట.
Image result for bharath ane nenu
ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కోసం ఫిట్‌గా తయారైనట్టు మహేష్ ఈ చిత్రం కోసం వర్క్ ఔట్స్ చేయబోతున్నాడట.కేవలం ఫిజికల్‌గానే కాకుండా లుక్స్‌ పరంగాను మహేష్‌ ఇందులో కొత్తదనం చూపిస్తాడట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తొందర ఎందుకు టైం తీసుకుని చేద్దాం అని మహేష్ చెప్పాడంట.వచ్చే సమ్మర్ కి సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నారు టీం.
Related image
ఈ సినిమాకి దిల్ రాజు, అశ్వనీదత్‌ నిర్మాతలు. సమ్మర్ లో వచ్చిన ‘పోకిరి’,‘భరత్ అనే నేను’ సినిమాలు హిట్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాని కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారంట. అంతే కాదు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ కూడా మహేష్ బాబు తో ఓ చిత్రం తీయబోతున్నారని టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: