భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయారు శ్రీదేవి. తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో నటించిన ఆమె బాలీవుడ్ లో స్థిరపడ్డారు.  అక్కడే ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు.  వివాహం అనంతరం సినిమాకు గుడ్ బాయ్ చెప్పిన శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఆ మద్య దుబాయ్ లో అనుకోకుండా చనిపోయారు.  ఆమె మరణంపై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చినా..అక్కడి పోలీస్ వారు మాత్రం ఆమె బాత్రూమ్ టబ్ లో ప్రమాద వశాత్తు చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. తాజాగా ఆమెది సాధారణ మరణం కాదని, ఆమెను ఎవరో కావాలని హత్య చేసారని రకరకాలుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
  Image result for sridevi death mystery
కాగా ప్రస్తుతం ఆమెను ఇన్సూరెన్సు డబ్బుకోసం హత్య చేశారనే ఒక వార్త సంచలనం రేపుతోంది. శ్రీదేవి మరణంపై ఎటువంటి అనుమానాలు అవసరంలేదని అప్పట్లో సుప్రీమ్ కోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే ప్రస్తుతం సునీల్ సింగ్ అనే ఒక సినీ నిర్మాత మళ్లి సుప్రీమ్ కోర్టులో ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ వేసిన పిటిషన్ లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయని సమాచారం. కాగా సునీల్ సింగ్ పిటీషన్ ప్రకారం శ్రీదేవి పేరుతో రూ.240 కోట్లకు ఇన్సూరెన్సు పాలసీ ఒకటి ఒమన్ లో తీసుకున్నట్లు తెలుస్తోంది. 
Image result for sridevi death mystery
ట్విస్ట్ ఏంటంటే.. ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే ఆ సొమ్ము ఆమె వారసులకు దక్కుతుందన్న నిబంధన ఉంది. అయితే, ఈ విషయంలోనూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందులో మొదటిది ఓ వ్యక్తి పేరిట రూ.240 కోట్లకు బీమా ఇస్తారా? అన్నది తొలి సందేహం కాగా, బీమాదారు దుబాయ్‌లో మరణిస్తేనే ఆ సొమ్ము వారి వారసులకు ఇస్తారా? అనేది రెండోది. నిజానికి ఇలాంటి నిబంధనలు ఏ జీవిత బీమా సంస్థలోనూ ఉండవని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు దుబాయ్ అడ్డా అని, కాబట్టి శ్రీదేవి మరణంలో అతడి పాత్ర కూడా ఉండొచ్చనేది మరో వాదన.
Image result for sridevi death mystery
ఇస్లామిక్ దేశమైన దుబాయ్‌లో దావూద్ దర్యాప్తును ప్రభావితం చేయగలడని వేద్‌భూషణ్ అనే రిటైర్డ్ ఏసీపీ పేర్కొన్నారు. శ్రీదేవి మరణంపై ఇటీవల ఆయన తన బృందంతో కలిసి దర్యాప్తు కూడా జరిపారు. దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన హోటల్‌కు వెళ్లారు. అయితే శ్రీదేవి మరణించిన రూములోకి వెళ్లేందుకు సిబ్బంది నిరాకరించారు. దుబాయ్‌లో ఆమె మరణించిన హోటల్ దావూద్‌దేనని, కాబట్టి ఆమె మరణంలో అతడి పాత్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణానికి గల కారణాన్ని కేవలం 60 గంటల్లోనే తేల్చేశారంటే దీని వెనక కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: