‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తో రామ్ చరణ్ కెరియర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయిన నేపధ్యంలో కంటెంట్ పరంగా ప్రయోగం చేసి మెప్పిస్తే భారీ సక్సెస్స్ ను అందుకోవడం సాధ్యం అన్న అభిప్రాయంలో ఉన్నాడు.   ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి ‘రంగస్థలం’ అర్ధ శతదినోత్సం పూర్తి చేసుకున్నాక కూడా ఇంకా కలెక్షన్స్ బాగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ చరణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలక్షన్స్ పోస్టర్స్ మ్యానియా పై తన వైరాగ్యాన్ని  ప్రదర్శించాడు. 
RAMCHARAN MEDIA INTERVIEW LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
భవిష్యత్ లో తన సినిమాలకు కలెక్షన్స్ ఫిగర్స్ ను ప్రచారం చేస్తూ పోస్టర్స్ విడుదల చేయడాన్ని తాను ప్రోత్సహించను అంటూ సంచనల వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు  ఇలా టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ పోస్టర్స్ విడుదలచేస్తున్న పరిస్థుతులలో హీరోల మధ్య ముఖ్యంగా హీరోల అభిమానుల దూరం పెరుగుతోందని అది తనకు ఏమాత్రం నచ్చడంలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
RAMCHARAN MEDIA INTERVIEW LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఒకప్రముఖ సంస్థ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ నియమింపబడిన నేపధ్యంలో ఈ కలక్షన్స్ పోస్టర్స్ రగడను మనసులో ఉంచుకుని చరణ్ ఈకామెంట్స్ చేసాడు. తమ సినిమా ఘనవిజయం సాధించినందుకు ఆనందపడుతూ నిర్మాతలు కలక్షన్స్ పోస్టర్స్ విడుదల చేస్తుంటే దానికి కొందరు వ్యతిరేక అర్ధాలు తీస్తున్నారు అంటూ టాప్ హీరోల కలక్షన్స్ పోస్టర్స్ ఫేక్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని చరణ్ ఈకామెంట్స్ చేసాడు.
RAMCHARAN MEDIA INTERVIEW LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే సినిమా పూర్తిగా ప్రేక్షకులకు నచ్చితే దానికి కలక్షన్స్ పోస్టర్ల ప్రచార సహాయం అక్కరలేదు అంటూ సినిమా కథ మాత్రమే ప్రేక్షకులను ధియేటర్స్ కు రక్షిస్తుంది అని అంటున్నాడు. చరణ్ కామెంట్స్ చూస్తూ ఉంటే భవిష్యత్ లో చరణ్ సినిమాలకు  సంబంధించిన కలక్షన్స్ పోస్టర్స్ హడావిడి ఉండకపోవచ్చు అన్న క్లారిటీ వస్తోంది. అయితే రాజమౌళి తీయబోతున్న భారీ మల్టీ స్టారర్ లో జూనియర్ తో చరణ్ కలిపి నటిస్తున్న నేపధ్యంలో రాజమౌళి సినిమాకు సంబంధించి ప్రచార వ్యూహంలో విడుదల చేసే కలక్షన్స్ పోస్టర్స్ ను అదేవిధంగా కలక్షన్స్ రికార్డుల ప్రచారాన్ని చరణ్ ఎంత ప్రయత్నించినా ఆపగలడా అన్నదే సందేహం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: