‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘సాహో’ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అన్న ఆతృతతో ప్రభాస్ అభిమానులు ఈసినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకున్న ఈమూవీ పై అంచనాలు పెంచడానికి ఈమూవీ దుబాయ్ షూటింగ్ సీన్స్ కు సంబంధించిన స్టిల్స్ ను వ్యూహాత్మకంగా విడుదల చేస్తున్నారు.
PRABHAS LOOK IN SAHO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈ స్టిల్స్ ప్రభాస్ అభిమానులలో తీవ్ర కలవర పాటుకు గురి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘సాహో’ లో ప్రభాస్ ముఖం చాల ఉబ్బిపోయి కనిపిస్తూ అతని బాడీ షేప్ లో ఆకర్షణ తగ్గింది అని ప్రభాస్ అభిమానులలో కొందరు తమ భయాలను బయటపెడుతున్నారు. దీనికితోడు మహేష్ జూనియర్ రామ్ చరణ్ లు తాము నటించే ప్రతి సినిమా సినిమాకు తమ లుక్ ను పూర్తిగా మార్చుకుంటూ తమ వయస్సు కంటే చిన్నగా కనిపిస్తున్న పరిస్థుతులలో ప్రభాస్ ‘సాహో’ లుక్ ప్రభాస్ వయస్సును మించి కనపడుతోంది అని ప్రభాస్ అభిమానులు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 
PRABHAS LOOK IN SAHO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అదేవిధంగా బాలీవుడ్ హీరోలు కూడ తాము నటించే ప్రతి సినిమాలోను తమ వయస్సు కంటే తక్కువగా కనిపించే విధంగా తమ లుక్ ను మార్చుకుంటూ ఉంటే ప్రభాస్ మాత్రం తన లుక్ పట్ల అశ్రద్ధ చేస్తున్నాడు అన్నది ప్రభాస్ వీరాభిమానుల వాదన. దర్శకుడు సినిమాను ఎంత అద్భుతంగా తీసినా ఆసినిమాలో నటించే హీరో లుక్ కూడ చాల కీలకంగా మారుతున్న నేపధ్యంలో ప్రభాస్ ‘సాహో’ లో తన లుక్ గురించి సరైన శ్రద్ధ తీసుకోవడం లేదా అన్న అనుమానాలు కూడ ప్రభాస్ అభిమానులను వెంటాడుతున్నాయి. 
PRABHAS LOOK IN SAHO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ప్రస్తుతం ఈమూవీ యూనిట్ వర్గాలు లీక్ చేస్తున్న ఫోటోలు దుబాయ్ లో జరుగుతున్న భారీ యాక్షన్ సీన్స్ కు సంబంధించినవి. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తరువాత ప్రభాస్ శ్రద్ధా కపూర్ లపై రొమాంటిక్ సీన్స్ తీయడానికి త్వరలో యూరప్ వెళ్ళబోతున్నారు. బహుశా ప్రభాస్ అందమైన రొమాంటిక్ లుక్ కు సంబంధించిన స్టిల్స్ యూరప్ నుండి ప్రభాస్ అభిమానులకోసం విడుదల చేసే ఆస్కారం ఉంది. ప్రభాస్ లుక్ పై అభిమానులలో రేగిన అసంతృప్తి ప్రభాస్ వరకు చేరుతుంది కాబట్టి ‘సాహో’ లుక్ విషయంలో మరిన్ని మార్పులు ఈసినిమా దర్శకుడు తీసుకునే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: