రామ్ చరణ్ నిన్న ఒక మొబైల్ కంపెనీ లేటెస్ట్ ప్రోడక్ట్ ను లాంచ్ చేస్తూ అక్కడ తనతో మాట్లాడిన మీడియా వర్గాలతో చేసిన కామెంట్స్ ఇప్పుడు మహేష్ చరణ్ ల అభిమానుల మధ్యచిచ్చు రేపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చరణ్ మహేష్ తో చాల సన్నిహితంగా ఉంటున్నాడు. అదేవిధంగా చరణ్ భార్య ఉపాసన మహేష్ భార్య నమ్రత కూడ చాలమంచి స్నేహితులు. 
RAMCHARAN AT HAPPY MOBILES LAUNCH PHOTOS కోసం చిత్ర ఫలితం
అయినప్పటికీ ఈ సమ్మర్ రేస్ కు వచ్చిన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ మూవీల కలక్షన్స్ విషయంలో ఒకదానితో ఒకటి పోటీపడిన నేపధ్యంలో ఈరెండు సినిమాలలో ఏసినిమాకు అత్యధిక కలక్షన్స్ నిజంగా వచ్చాయి అన్న చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ కలక్షన్స్ రికార్డులను ‘భరత్ అనే నేను’ క్రాస్ చేసింది అంటూ భరత్ నిర్మాతలు ‘రంగస్థలం’ రియల్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ జాతీయ మీడియాలో కథనాలు రావడంవెనుక చరణ్ పి ఆర్ టీమ్ పోటీగా చేసిన ప్రచారం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇద్దరు మంచి స్నేహితుల సినిమాల మధ్య ఈవిధమైన పోటాపోటీ ప్రచారం ఏమిటి అంటూ ఇండస్ట్రీని శాసిస్తున్న వారు కూడ ఆశ్చర్యపోయారు.   
సంబంధిత చిత్రం
ఇలాంటి పరిస్థుతులలో చరణ్ నిన్న మాట్లాడుతూ సినిమా కలక్షన్స్ పోస్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయని టాప్ హీరోల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆపోస్టర్లు దెబ్బతీస్తున్నాయి అంటూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్నకోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. దీనికి కొనసాగింపుగా చరణ్ భవిష్యత్ లో తన సినిమాలకు సంబంధించిన కలక్షన్స్ పోస్టర్లు ఇక కనపడవు అని ప్రకటించినా మహేష్ జూనియర్ ప్రభాస్ బన్నీలు చరణ్ సూచనలకు అంగీకరిస్తారా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 
RAMCHARAN AT HAPPY MOBILES LAUNCH PHOTOS కోసం చిత్ర ఫలితం
‘దువ్వాడ జగన్నాధమ్’ ‘సరైనోడు’ సినిమాల విషయంలో బన్నీ రిలీజ్ చేసిన కలక్షన్స్ పోస్టర్ల విషయంలో చాలవిమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అదేవిధంగా ‘భరత్’ కలక్షన్స్ ఫేక్ అనే గాసిప్పులు కూడ హడావిడి చేసాయి. దీనితో తమ టాప్ హీరోల కలక్షన్స్  ఫిగర్స్ చూసుకుని గర్వపడే టాప్ హీరోల అభిమానులకు చరణ్ స్థాయిలో సంస్కారం ఉంటుందా అన్నసందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో చరణ్ చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా తన ‘రంగస్థలం’ మాత్రమే రియల్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న అర్ధాన్ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి అని మహేష్ అభిమానులు భావిస్తున్నట్లు టాక్. యథాలాపంగా చరణ్ అన్న కామెంట్స్ టాప్ హీరోల అభిమానుల మధ్య పెద్ద చిచ్చునే రగిల్చేల ఉన్నాయని కొందరు ఈపరిణామాల పై కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: