తెలుగు ఇండస్ట్రీలో ‘ఇడియట్’ చిత్రంతో మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రవితేజ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకు పోయాడు.  స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ‘పవర్’ చిత్రం తర్వాత వరుసగా అపజయాలు చవిచూశాడు.  ఒకదశలో రవితేజ కెరీర్ కి బ్రేక్ పడిపోయిందని అన్నారు.  కానీ రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మరోసారి తన పవర్ ఏంటో చూపించాడు. ట్విస్ట్ ఏంటంటే..ఈ చిత్రంలో పూర్తిగా అంధుడిగా నటించినా..తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో  విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత ‘టచ్ చేసి చూడు’ పెద్దగా విజయం సాధించలేక పోయింది. 
Image result for nela ticket posters
తాజాగా మరో మాస్ ఎంట్రటైన్ మెంట్ గా ‘నేల టిక్కెట్టు’ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. న్నప్పటి నుండి అనాథలా పెరిగిన రవితేజ  జనం మధ్యలో మనం, జీవితంలో అందరినీ కలుపుకుని పోవాలి అనే తత్వంతో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తుంటాడు. అలా జనానికి సహాయం చేసే ప్రక్రియలో అతనికి, హోమ్ మంత్రి జగపతి బాబు తో గొడవకు దిగుతాడు. రవితేజ  హోమ్ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు..రిద్దరికీ మధ్యన సంబంధం ఏమిటి, హోమ్ మంత్రి చేసిన తప్పేమిటి అనేదే చిత్ర సారాంశం.
Image result for nela ticket posters
రవితేజ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు..తన మాస్ ఇమేజ్ ని ఎక్కడా డ్యామేజ్ కాకుండా చూసుకున్నాడు. ఫైట్ సీన్స్, ఫన్నీ సన్నివేశాలను బాగానే రక్తి కట్టించారు. ఇక మధ్య మధ్యలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, ప్రియదర్శి, అలీలు చేసిన కామెడీ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత నవ్వించారు. కాకపోతే.. హీరో పాత్ర, ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని ఫన్నీ సన్నివేశాలు మినహా మిగతా చిత్రం మొత్తం బోర్ కొట్టించేలా ఉంది.

ప్రతి సీన్ రొటీన్ గా, సాగదీసినట్టు, కథనం మధ్యలోకి బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ఇక హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ అయితే ఏమాత్రం అలరించలేకపోయిందని అంటున్నారు. సంపత్, జగపతిబాబు, పోసాని, బ్రహ్మానందం, అలీ లాంటి వారు కూడా సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదని ప్రేక్షకులు అంటున్నారు.  సంగీత దర్శకుడు శక్తి కాంత్ సంగీతం కాస్త పరవాలేదు అనిపించింది. అయితే ఈ సినిమాపై కొంత మంది పాజిటీవ్ గా స్పందిస్తే..కొంత మంది నెగిటీవ్ గా స్పందిస్తున్నారు. ఏది ఏమైనా రేపటి కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో దాన్ని బట్టి సినిమా హిట్టా..ఫట్టా అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: