ఈ మద్య సినిమా ప్రమోషన్ల పుణ్యమా అని హీరో, హీరోయిన్లు ఎక్కడ పడితే..అక్కడ ప్రమోషన్ వర్క్ చేయాల్సి వస్తుంది.  ఇక బాలీవుడ్ అయితే ప్రమోషన్లు జనాల మద్యలోకి వెళ్లి మరీ చేస్తున్నారు.  ఎలాగైనా తమ చిత్రాలపై క్యూరియాసిటీ పెరిగేలా చేస్తున్నారు. ఈరోజు మాస్ మహరాజ రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’ సినిమా రిలీజ్ అయ్యింది.  కింగ్ నాగార్జున తో ‘సోగ్గాడే చిన్నినాయన’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాన్ కృష్ణ ‘నేల టిక్కెట్టు’ సినిమాకు దర్శకత్వం వహించారు.
Image result for nela ticket
ఈ సినిమాలో రవితేజ సరసన హాట్ బ్యూటీ మాళవిక శర్మ నటించింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ మాళవిక శర్మ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో టికెట్స్ అమ్మింది. మాళవిక టికెట్స్ అమ్మబోయే విషయాన్ని అంతకుముందే ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన చిత్రయూనిట్ ఈ రోజు మాళవిక తో టికెట్స్ సేల్ చేయించింది.
Image result for nela ticket
అందాల తార మాళవిక శర్మను చూడటానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. చాలామంది ఆమె చేతుల మీదుగా టికెట్స్ తీసుకొని ఆనంద పడ్డారు.ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నేల టిక్కెట్టు’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రవితేజ -మాళవిక జోడీ చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: