‘ఉయ్యాలా జంపాలా' తో మొదలై 'కుమారి 21ఎఫ్‌' వరకు వరస విజయాలు ఇచ్చిన రాజ్ తరుణ్ కెరియర్ ప్రస్తుతం తీవ్ర అయోమయంలో ఉంది. గత కొంతకాలంగా ఈయంగ్ హీరో నటించిన సినిమాలు అన్ని వరస పరాజయాలు అందుకుంటున నేపధ్యంలో ఈవారం విడుదల కాబోతున్న   ‘రాజుగాడు’ మూవీ ఫలితం బట్టి ఈహీరో భవిష్యత్ ఆధార పడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
RAJ TARUN IN IN RAJU GADU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతలలో నూతన దర్శకురాలు సంజన దర్శకత్వంలో రూపొందిన ఈ ‘రాజుగాడి’ పై రాజ్ తరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సందర్భంలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ ఈసినిమాలో తనకు ఉండే వింత వ్యాధి లక్షణాలను బయటపెట్టాడు. ఈమూవీలో తన పాత్ర  ‘క్లెప్టోమేనియా’ అనే వింత వ్యాధితో భాధపడుతుందని తనకు తెలియకుండానే తన చేయి దొంగతనం చేసే వింత జబ్బు తనకు ఈసినిమాలో ఉంటుందని తన పాత్ర గురించి లీకులు ఇస్తున్నాడు రాజ్ తరుణ్. 
సంబంధిత చిత్రం
ఇలాంటి వింత వ్యాధి చాలామందికి ఉంటుంది అని చెపుతూ ఈవ్యాదితో సతమతమయ్యే తన పాత్ర ఒక క్రైంలో చిక్కుకున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు అందరికీ నవ్వు తెప్పించే హాస్యంతో ఈమూవీలో తాను నటించిన విషయాన్ని బయట పెట్టాడు రాజ్ తరుణ్. ఈసినిమాలో తన పేరు రాజు కావడంతో అందరూ తనని రాజుగాడు అంటూ ఆట పట్టిస్తారు అంటూ ఈసినిమా టైటిల్ వెనుక సీక్రెట్ ను బయట పెట్టాడు ఈ యంగ్ హీరో.
RAJ TARUN IN IN RAJU GADU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమాకు తానే హీరో అయినప్పటికీ రాజేంద్రప్రసాద్ కామెడీ ఈమూవీకి ప్రత్యేక ఆకర్షణ అని అంటూ ఈసారి తన లక్ క్లిక్ అవుతుంది అని నమ్మకంగా చెపుతున్నాడు రాజ్ తరుణ్. ‘మహానటి’ విడుదలై మూడు వారాలు అయిపోతున్న నేపధ్యంతో పాటు ‘మహానటి’ తరువాత విడుదలైన ఏ ఒక్క మూవీ కనీస విజయాన్ని కూడ అందుకోలేకపోవడంతో ఈసమ్మర్ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క కామెడీ సినిమా కూడ విడుదల కాని కారణాలతో నిజంగా ప్రేక్షకులను నవ్వించగలిగితే ‘రాజుగాడు’ మినుమం సక్సస్ అందుకునే ఆస్కారం ఉంది. దీనికితోడు ఈమూవీతో పోటీగా వస్తున్న నాగార్జున ‘ఆఫీసర్’ పై ఏమాత్రం పాజిటివ్ టాక్ లేకపోవడం రాజ్ తరుణ్ కు కలిసి వస్తున్న అదృష్టం అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: