మొన్న ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ యధాలాపంగా చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పవన్ కు మధ్య ఎటువంటి గ్యాప్ ఏర్పడలేదని అన్నీ అనుకూలిస్తే 2019 ఎన్నికల తరువాత తాను పవన్ తో ఒక సినిమాను చేసినా ఆశ్చర్యం లేదు అని అంటూ ఆమూవీ తాను పవన్ కోసం తయారు చేసిన ‘కోబలి’ కథ కావచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.
PAVAN SRIKAKULAM TOUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఈకామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నాయి. దీనికి కారణం 2019 ఎన్నికల తరువాత పవన్ తానే కాబోతున్న ముఖ్యమంత్రి అని చెపుతూ తన ‘జనసేన’ అధికారంలోకి వస్తంది అని పవన్ ప్రస్తుతం చేపట్టిన ‘పోరాట యాత్ర’ లో ఖచ్చితంగా చెపుతున్నాడు. దీనికితోడు పవన్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ పవన్ అభిమానులు ఎక్కడికక్కడ జయజయద్వానాలు చేస్తున్నారు. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా త్రివిక్రమ్ 2019 ఎన్నికల తరువాత తాను పవన్ తో సినిమా తీసే అవకాశం ఉంది అని చెప్పడం వెనుక పవన్ రాబోతున్న ఎన్నికలలో ఓడిపోతాడు అన్న సంకేతాలు త్రివిక్రమ్ ఇస్తున్నాడా అంటూ త్రివిక్రమ్ పై కామెంట్స్ చేస్తున్నారు పవన్ అభిమానులు. ప్రస్తుతం పవన్ శ్రీకాకుళంలో చేస్తున్న ‘పోరాట యాత్ర’ కు జనం నుంచి స్పందన బాగానే వస్తున్న పవన్ తన టూర్ లో కవర్ చేస్తున్న ప్రతి ఊరిలోనూ పలానా స్థానికి వ్యక్తులు తన ‘జనసేన’ ప్రతినిధులు అంటూ ప్రజలకు పరిచయం చేయలేకపోతున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

PAVAN SRIKAKULAM TOUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో ‘జనసేన’ కు స్థానిక నాయకత్వం ఏర్పాటు పై పవన్ దృష్టి పెట్టడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం ఒంటరి పోరాటం చేస్తూ జనం మధ్యకు పవన్ వెళ్ళిపోయి ఎన్ని ఘాటైన విమర్శలు చేసినా జనంలో ఏర్పడిన అసహనాన్ని ఓట్లుగా మార్చుకునే స్థానికి నాయకత్వం గురించి పవన్ ఎందుకు ఆలోచించడం లేదు అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: