తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు తనయుడు రవిబాబు ‘అల్లరి’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు రవిబాబు.  డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న డైరెక్టర్ రవిబాబు. కామెడీ, లవ్, హర్రర్, సస్పెన్స్‌ ప్రాజెక్టులతో తన టాలెంట్‌ను ప్రువ్ చేసుకున్నాడు.  ఈ మద్య దర్శకత్వానికి దూరంగా ఉంటూ..క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.
Image result for RAVI BABU ADIGO MOVIE
చాలా రోజుల తర్వాత అదుగో అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి రోటిన్‌కు భిన్నంగా పంది పిల్లకు కూడా మూవీలో క్యారెక్టర్ ఇచ్చాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కోసం రవిబాబే అన్నీ తానై చూసుకుంటున్నాడు. మొన్నే వెరైటీ టీజర్‌తో అందరికి షాకిచ్చి.. ఇప్పుడు మరో వీడియోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. రవిబాబు బంటి (పందిపిల్ల) ను పెంచుకుంటున్నాడు.
Image result for RAVI BABU ADIGO MOVIE
షూటింగ్ సమయంలో బంటీని ఎలా రెడీ చేశాడో ఫన్నీగా వీడియో రూపంలో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో రవిబాబు పంది పిల్ల పళ్లను తోముతూ కనిపించాడు. త్వరగా బ్రష్ చెయ్ షూటింగ్‌కు వెళ్లాలంటూ బంటీకి బ్రష్ చేయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లకు తెగ నవ్వు కూడా తెప్పిస్తోందట. విబాబు తన సొంత బ్యానర్ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అభిషేక్, నాభ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: