రాం చరణ్ తేజ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా వేసవిలో ప్రభంజనం సృష్టించి, వసూళ్ళ ప్రవాహం కూడా సాధించింది. 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 210 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లని సాధించి హేరో కెరీర్ లోనే ప్రధానంగా అత్యద్భుత చిత్రంగా నిలిచింది. అంతేకాదు చరణ్ నటన పరంగా కూడా ఒక మైలురాయిగా నిలిచి పోయింది. 
Image result for rangasthalam rangamma mangamma song
అయితే ఆ సినిమాని విడుదల కంటే ముందు నుండే అనేక వివాదాలు చుట్టుముట్టాయి "రంగమ్మ మంగమ్మ" అనే పాట పై అప్పట్లో రచ్చ రచ్చ కాగా ఇటీవల రంగస్థలం చిత్ర కథ నాదే అంటూ గాంధీ అనే వ్యక్తి రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు. గాంధీ రచించిన కథకు రంగస్థలం చిత్రకథకు సామ్యం ఉండటంతో రచయితల సంఘం రంగస్థలం సినిమా దర్శకుడు సుకుమార్ ని వివరణ కోరింది. సుకుమార్ సమాధానం ప్రకారం నేను కానీ, నా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, రచయిత గాంధీని ఎప్పుడూ కలవలేదు. అతడితో మాకు ఏవిధమైన సంబంధం లేదు. 
Image result for rangasthalam movie sukumar copied
ఇక కథ విషయానికి వస్తే, అనారోగ్యంతో ఉన్నవాళ్ళని ఉరి తీయరని, అలాగే సిడ్ని షెల్డన్ రాసిన "ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్" నవల కూడా ఇదే స్టోరీ లైన్ లో ఉంటుందని ఆ స్ఫూర్తితోనే నేను కథ రాసుకున్నానని అంతేకాని గాంధీ కథని కాపీ కొట్టలేదని చెబుతున్నాడు. గాంధీ కాపీ అంటున్నాడు-సుకుమార్ కాదంటున్నాడు. మరి రచయితల సంఘం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి?   

Image result for rangasthalam rangamma mangamma song

మరింత సమాచారం తెలుసుకోండి: