టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిన్న మొన్నటివరకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ హవాకు బ్రేక్ పడటంతో ఇప్పుడు ఆమె పరభాష సినిమాలపై తనదృష్టి పెట్టి అక్కడ అవకాశాలకై ఎదురు చూస్తోంది. ఈమెకు కోలీవుడ్ లో ఆఫర్స్ బాగానే వస్తున్నా ఇంకా సరైన హిట్ రాకపోవడంతో ఆమె దృష్టి బాలీవుడ్ పై పడింది. ప్రస్తుతం ఈమె ఆఫర్స్ కోసం రకరకాల ఫ్యాషన్ మ్యాగజైన్స్ కు హాట్ ఫోటో షూట్స్ ఇస్తూ హడావిడి చేస్తున్న నేపధ్యంలో ఈమె గ్లామర్ గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. 
సంబంధిత చిత్రం
ఇలాంటి పరిస్థుతులలో ఈమె అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల ప్రస్తుతం మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న దుల్కర్ సల్మాన్ అభిమానుల కోపానికి గురైంది. రకుల్ ప్రీత్ తెలుగు సినిమాల గురించి ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటుంది. కొత్త సినిమాకు హిట్ టాక్ వచ్చింది అంటే చాలు స్పెషల్ షో వేసుకొని చూడటమే కాకుండా ఆసినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూ తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో పడటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. 
సంబంధిత చిత్రం
ఈమె లేటెస్ట్ గా ‘మహానటి’ సినిమా చూసి ఒక ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్విట్ అనుకోకుండా ఆమెకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఈమధ్య కాలంలో తాను చూసిన తెలుగు సినిమాలలో ‘మహానటి’ అద్భుతం అని చెపుతూ తాను ఈమూవీతో బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని పేర్కొంది. అంతేకాదు ఈమూవీలో నటించిన కీర్తి సురేష్ సమంత విజయ్ దేవరకొండలు అందరు చాలాబాగా చేశారని ప్రశంసలు కురిపించింది. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ ప్రశంసల లిస్టులో కీలక పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ పేరును మాత్రం మరిచిపోయింది. ఈ చిన్న పొరపాటు వివాదంగా మారి దుల్కర్ అభిమానులు రకుల్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెట్టడమే కాకుండా మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో రకుల్ కు ఏహీరో అవకాశాలు ఇవ్వద్దూ అంటూ దుల్కర్ అభిమానులు పిలుపును ఇచ్చారు. అయితే చేసిన తప్పును సరిదిద్దుకుని రకుల్ క్షమార్పణ చెప్పినా ఇంకా ఆమె దుల్కర్ అభిమానుల దృష్టిలో శత్రువుగానే కొనసాగుతున్న నేపధ్యంలో సమస్యకు పరిష్కారం ఏమిటి అన్న కోణంలో రకుల్ ఆలోచిస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: