టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆత్మస్థైర్యాన్ని ‘అజ్ఞాతవాసి’ ఏవిధంగా దెబ్బ కొట్టిందో అన్న విషయానికి సంబంధించిన మరో ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఓవర్ సీస్ హక్కులు ఎల్ ఎ తెలుగు సంస్థకు ఇవ్వడం త్రివిక్రమ్ కు అంతగా ఇష్టం లేదని తెలుస్తోంది. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికి కారణం ఈసంస్థ ‘అజ్ఞాతవాసి’ విషయంలో అనుసరించిన పబ్లిసిటీ వ్యూహాలు త్రివిక్రమ్ కి ఏమాత్రం నచ్చలేదనే వార్తలు ఉన్నాయి. ఈమూవీ విషయంలో ఈసంస్థ ఓవర్ సీస్ లో చేసిన ఓవర్ పబ్లిసిటీ వల్ల ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్ అయింది అని త్రివిక్రమ్ భావన అని అంటున్నారు. 
ARAVINDA SAMTHA VEERARAGHAVA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఎల్ ఎ తెలుగు సంస్థకు అమెరికాలోని ధియేటర్ల మీద మంచి పట్టు ఉన్న నేపధ్యంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను త్రివిక్రమ్ ఇష్టపడకపోయినా ఆవిషయాలు ఏమి పట్టించుకోకుండా ఈమూవీ నిర్మిస్తున్న హారిక హాసిని వర్గాలు త్రివిక్రమ్ ను ఒత్తిడి చేసి ఒప్పించి ‘అరవింద సమేత’ రైట్స్ ను ఎల్ ఎ తెలుగు సంస్థకు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ టైటిల్ మరియు కథ విషయంలో తన మాట చెల్లలేదు అని బాథ పడుతున్న త్రివిక్రమ్ కు ‘అరవింద సమేత’ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ విషయంలో కూడ సద్దుకు పోవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.  
ARAVINDA SAMTHA VEERARAGHAVA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఓవర్సీస్ రైట్స్ కేవలం 15.5 కోట్లకు మాత్రమే ఇవ్వడం వెనుక త్రివిక్రమ్ సినిమాలకు తగ్గిన క్రేజ్ దానికితోడు జూనియర్ సినిమాలకు ఇంకా పూర్తిగా పెరగని ఓవర్సీస్ మార్కట్ అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీలో సిక్స్ ప్యాక్ లో కనిపించేందుకు ప్రయత్నాలు చేసిన జూనియర్ తాను  18 కిలోల బరువు తగ్గడం కోసం ఎన్టీఆర్ ప్రతిరోజు 15 లీటర్ల మంచినీరు త్రాగి తన శరీరాన్ని ఫిట్ గా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: