ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలకు పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్తుందా అన్న సంఘటనలు నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి.  సంతోషానికి, దుఖాఃనికి తేడా తెలియని పరిస్థితి నెలకొంది.  ఎవరైనా ప్రమాదానికి గురైతే ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తారు..పండ్లో, బ్రెడ్ లేదా వారు కోలుకుంటే ఏదైనా బొకేనో ఇచ్చి మంచి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తారు.  కానీ ఓ బాలీవుడ్ నటి మాత్రం ఇందుకు విరుద్దంగా పేషెంట్ ని పరామర్శించడానికి వచ్చి వీల్ చైర్ లో నాగిని డ్యాన్స్ వేసి హంగామా చేసింది.
Image result for farah khan injury
వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత అయిన ఫరాసనా ఖాన్ కాలి ఎముక విరిగిన విషయం తెలిసిందే. అందుకోసం ఆమె సర్జరీ చేయించుకుంంది..ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను పరామర్శించేందుకు పలువురు సెలబ్రిటీలు క్యూ కట్టారు. సీమా ఖాన్, మలైకా అరోరా, అమృతా అరోరా తదితరులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన వారిలో ఉన్నారు.
Image result for farah khan injury
ఈ క్రమంలో నటి  కరిష్మా తన్నా కూడా పరామర్శించడానికి వెళ్లారు..అయితే అక్కడే ఓ విచిత్రం జరిగింది.  ఫరా ఖాన్ ఇంటికి వెళ్లిన కరిష్మా తన్నా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి ఆమెకు మనోధైర్యాన్ని నింపడానికి వీల్ చైర్ లోనే కూర్చొని నాగిని డ్యాన్స్ చేసింది. 
Image result for farah khan injure
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, ఈ నెల ప్రారంభంలో ఓ టీవీ షోలో ఆమె గాయపడిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం అక్టోబరులోనూ ఆమె కాలు విరగగా, ఇప్పుడు మరోసారి అదే కాలుకు గాయం కావడంతో నృత్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యలు సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: