తన బాబాయ్ పవన్ పిలిస్తే తాను ‘జనసేన’ పార్టీలోకి చేరి ఆపార్టీ తరఫున ప్రచారం చేస్తాను అంటూ ఈమధ్య చరణ్ చేసిన కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలస్యంగా స్పందించాడు. తన పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాను అనీ అదేవిధానం తన కుటుంబసభ్యులకు కూడ ఉంటుందని అయితే తాను ప్రత్యేకంగా తన కుటుంబ సభ్యులను తన పార్టీలోకి రమ్మని ఆహ్వానించను అంటూ పవన్ వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడు.  
PAVAN SRIKAKULAM TOUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు తన కుటుంబ స‌భ్యులు వారివారి ప‌నుల్లో బిజీగా హ్యాపీగా ఉన్నారని అందువల్ల వారు ‘జనసేన’ లోకి వస్తాము అన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోమని చెపుతానని అంటూ రాజకీయాలు సినిమాలంత సులువు కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈకామెంట్స్ పై మెగా అభిమానులలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
PAVAN SRIKAKULAM TOUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కొందరు మెగా అభిమానుల అభిప్రాయం ప్రకారం పవన్ కు తన కుటుంబ సభ్యులను ‘జనసేన’ లోకి తీసుకురావడం ఇష్టం లేదని అందుకే ఇలా కామెంట్ చేసాడు అని అభిప్రాయ పడుతుంటే మరికొందరు చరణ్ పిలిస్తే వస్తాను అంటూ కండిషన్స్ పెట్టడం పవన్ కు నచ్చలేదు అన్న కామెంట్స్ చేస్తున్నారు. దీనితో పవన్ మనసులో ఎదో పెట్టుకుని చరణ్ కామెంట్స్ కు ఇలా స్పందించాడు అని చాలామంది భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ చేస్తున్న ‘పోరాట యాత్ర’ లో నిన్న చంద్రబాబును ఉద్దేసించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ తన ‘పోరాట యాత్ర’ లో చంద్రబాబు పై విమర్శల వేడి పెంచాడు. 
PAVAN SRIKAKULAM TOUR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో రానున్న ఎన్నికలలో మెగా ఫ్యామిలీ ఓపెన్ సపోర్ట్ లేకుండా పవన్ ఒక్కడు రాజకీయ పోరాటం చేయగల పరిస్థుతులు ఉన్నాయా అన్న కోణంలో మెగా అభిమానులలోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటికే పవన్ అనేక విషయాలలో తన రాజకీయ వ్యూహాలను క్షణక్షణం మార్చుకుంటున్న నేపధ్యంలో రాబోతున్న ఎన్నికలలో ఏదైనా జరగవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: