తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో మంచి ఫామ్ లోకి వచ్చారు.  ప్రస్తుతం మహేష్ బాబు 25 వ చిత్రానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి.  స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశిపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. 
Image result for mahesh babu
ఈ చిత్రం షూటింగ్ వచ్చేనెల 8వ తేదీనగానీ .. 10వ తేదీనగాని మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మరో స్పెషల్ ఏంటంటే..మహేష్ బాబు ప్రాణ మిత్రుడిగా అల్లరి నరేష్ నటించబోతున్నాడట. 
Image result for allari naresh
మహేష్ సంపన్న కుటుంబానికి చెందినవాడైతే..అతి పేద కుంటుంబలో ఉన్న యువకుడిగా అల్లరి నరేష్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే దర్శక నిర్మాతలు కలిసి నాలుగు ట్యూన్స్ ను ఫైనలైజ్  చేశారట. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించనున్న సంగతి తెలిసిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: