ఆ మద్య తిప్పగొండనహళ్లి రిజర్వాయర్ వద్ద కన్నడ చిత్రం 'మస్తిగుడి' షూటింగ్ వేళ, విలన్లుగా నటిస్తున్న ఉదయ్, అనిల్ లు హెలికాప్టర్ నుంచి జలాశయంలో దూకే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న వేళ, జరిగిన ప్రమాదంలో వారిద్దరూ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.  దీనిపై తావరకెరె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిర్మాత సుందర్‌గౌడపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ జారీ అయింది.   
Image result for హీరో దునియా విజయ్
బుధవారం తావరకెరె పోలీసులు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పీఎస్‌ పరిధిలో ఉన్న సుందర్‌గౌడ ఇంటికి వెళ్లి అరెస్ట్‌ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ అదే సమయానికి దునియా విజయ్ అక్కడకు వెళ్లి పోలీసులను వారించి వారితో మట్లాడే సమయంలో  సుందరగౌడ తప్పించుకున్నాడు.

కాగా, పోలీసుల విధులకు అడ్డుపడి మాస్తిగుడి సినిమా నిర్మాత సుందరగౌడ పారిపోవడానికి సహకరించారని కన్నడ హీరో దునియా విజయ్‌పై బెంగళూరులో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. తావరకెరె హెడ్‌కానిస్టేబుల్‌ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: