అతిత్వరలో నేచురల్ స్టార్ నాని బుల్లితెర స్టార్ గా మారడంకోసం ‘బిగ్ బాస్ 2’ కి ప్రజంటర్ గా అతిత్వరలో మారబోతున్న నేపధ్యంలో నాని ఈషోను ఎలా నిర్వహిస్తాడు అన్నఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.  టీవీ ఎక్కువగా చూసే ఫామిలీ ఆడియన్స్ లో బలమైన ఇమేజ్ ఉన్న నాని ‘బిగ్ బాస్ 2’ షోని మరో లెవెల్ కు తీసుకెళతాడు అన్న  అంచనాలు స్టార్ మా యాజమాన్యంలో ఉన్నాయి. 
bigg-boss-telugu-season-2-latest-promo-host-nani
అయితే త్వరలో ప్రారంభంకాబోతున్న ఈషోలో మసాలాలు వివాదాలు ఎక్కువగానే ఉంటాయి అని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల పై విపరీతమైన విమర్శలు రాకుండా నాని తన సహజమైన బాడీ లాంగ్వేజ్ నే ఉపయోగించేలా ఈషోను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అటు మాస్ లోను ఇటు క్లాస్ లోను మంచి ఇమేజ్ ఉన్న నాని తన మాటలలో లోకల్ ఫ్లేవర్ ఉండేలా తన డైలాగ్స్ తో పాటు బాడీ లాంగ్వేజ్ ని కూడ మార్పు చేసుకున్నట్లు తెలుస్తోంది. 
Nani Started Shooting For Bigg Boss Season 2?
మరీ ప్రొఫెషనల్ గా ఉండకుండా జోవియల్ గా పార్టీసిపెంట్స్ తో సరదాగా కలిసిపోతూ ఉండేలా నాని మాటతీరును సెట్ చేస్తున్నట్లు టాక్. అయితే ఈషో విషయంలో ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా నాని షోను ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ ను నడిపించిన జూనియర్ తీరుతో బుల్లితెర ప్రేక్షకులు పోలుస్తారన్నది వాస్తవం. ఇలాంటి రియాల్టీ షోలు ఒక సెలెబ్రెటీ నడిపిన తరువాత మరొక సెలెబ్రెటీ నిర్వహించినప్పుడు గతంలో అనేకమంది తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. 
Nani Remuneration for Bigg Boss Telugu Show Hosting
‘కౌన్ బనేగా కరోడ్పతి’ అమితాబ్ నుంచి షారుఖ్ ఖాన్ నిర్వహాణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆరేంజ్ లో మెప్పించలేకపోయాడు అన్న కామెంట్స్ వినిపించాయి. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో చిరంజీవిని నాగార్జునతో పోలుస్తూ ఎందరో విమర్శలు చేసారు. అలాగే ఇలాంటి పరిస్థుతులు నానీకి రాకుండా ‘బిగ్ బాస్’ షో ఫార్మాట్ లోనే చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి షో మొత్తం హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా సెట్ వేసి మరీ తీస్తున్నారు. షో టిఆర్పి రేటింగ్స్ ని నాని ప్రభావితం చేసే విషయంలో జూనియర్ ను మరిపించేలా నానీ ఈషోను ఎలా నిర్వహిస్తాడు అన్న ప్రశ్నకు త్వరలోనే సమాధానం రాబోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: