ఎలాంటి ప్రముఖ వ్యక్తుల పై అయినా తన ఘాటైన కామెంట్స్ సెటైర్లతో ఇరుకున పెట్టే పోసాని ఏమి మాట్లాడినా సంచలనమే. తన మనసులోని మాటలను ఏమాత్రం దాచుకోకుండ బయటపెట్టే పోసానిలో ఎదుటి మనిషికి సహాయం చేసే కోణం కూడ ఉంది. ముఖ్యంగా పేద విద్యార్దులకు వారి ఉన్నత చదువుల కోసం పోసాని ఆర్ధిక సహాయం చేసిన సందర్భాలు చాల ఉన్నాయి. 
POSANI HELP TO 3 GIRL STUDENTS PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో పోసాని ఈమధ్య ముగ్గురు అమ్మాయిలకు చేసిన ఆర్ధిక సహాయం వెనుక అల్లు అర్జున్ సహకారం ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. రష్మిత రాజేశ్వరి షకీనబాయ్ అనే ముగ్గురు పేద పిల్లలకు వారు పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుని ఆతరువాత ఇంటర్మీడియట్ చదివే పరిస్థుతులు లేకపోవడంతో ఈముగ్గురుకీ లక్షా ఏబైవేలు ప్రతి ఒక్కరికీ అందే విధంగా పోసాని ఆర్ధిక సహాయం చేసాడు.
సంబంధిత చిత్రం
ఈ సహాయం అందుకున్న తరువాత ఆఅమ్మాయిలు పోసానిని పొగడ్తలతో ముంచెత్తివేస్తుంటే ఆసహాయం తనది కాదు అల్లు అర్జున్ ది అన్న విషయం బయట పెట్టాడు. కొద్ది రోజుల క్రితం తనను బన్నీ తన ఇంటికి పిలిచినప్పుడు ఈమధ్య కాలంలో తాను అల్లు అర్జున్ ను ఏమి విమర్శించ లేదుకదా అంటూ భయపడుతూ బన్నీ ఇంటికి వెళ్ళిన విషయాన్ని బయటపెట్టాడు. 
POSANI KRISHNA MURALI MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే తాను అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన తరువాత తన చేతిలో 5 లక్షల చెక్కు పెట్టి ఎవరైనా పేద పిల్లలకు సహాయం చేయమని కోరుతూ తన పేరు బయటకు రానీయవద్దని బన్నీ కోరిన విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు ఆడబ్బుతోనే ఈ పేద పిల్లలకు సహాయం చేసాను అని చెపుతూ వీరికి దేవుడు రూపంలో సహాయం చేసిన వ్యక్తి అల్లు అర్జున్ అంటూ ఈ పిల్లల ఆనందానికి బన్నీ మాత్రమే కారకుడు తాను కాదు అంటూ పోసాని ఒక టెలివిజన్ షోలో చేసిన కామెంట్స్ బన్నీ అభిమానులకు జోష్ ను ఇస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: