ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు..క్రికెటర్లతో ప్రేమాయణాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.  గతంలో  సీనీ, క్రికెట్ రంగాలకు చెందిన వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు.  ఈ మద్య ఐదేళ్లుగా ప్రేమించుకుని గతేడాది చివర్లో ఒకటయ్యారు.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ,  టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అంతేకాకుండా మరో క్రికెటర్ కెఎల్ రాహుల్ , హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని పుకార్లు వస్థున్నాయి. 

సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్న వారు క్రికెట్ అంటే ఎక్కువగా మోజు పడుతుంటారు. ఈ నేపథ్యంలో క్రికెట్ రంగానికి చెందిన వారితో వివాహాలు జరగడం సర్వ సాధారణం అయ్యింది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఓ యువ క్రికెటర్ ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. క్రికెటర్ కెఎల్ రాహుల్ , హీరోయిన్ నిధి అగర్వాల్  డేటింగ్ లో ఉన్నారని  వార్తలో సోషల్ మీడియాలో దుమ్మురేపాయి..కాగా వీటిపి ఆ ఇద్దరు తమకు ఎలాంటి సంబంధం లేదని..డేటింగ్ చేయడం లేదని..తాము కాలేజ్ మెట్స్ కావడం వల్ల కలిసి తిరిగామని క్లారిటీ ఇచ్చారు. 
shah-rukh-khan-daughter-suhana-love-kkr-player
ప్రస్తుతం బాలీవుడ్, క్రికెట్ రంగంలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ యువ క్రికెటర్‌ శుబ్‌మాన్‌ గిల్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్టు రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనంతరం నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు గిల్‌తో సుహానా ముచ్చటించడం అందరి ఆకర్షించింది.

ప్రస్తుతం వీరు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని సోషల్‌ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. ఈ మద్య సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి.  ఇలాంటి రూమర్లు సర్వ సాధారణం అని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నారో ఏమో షారూఖ్ ఖాన్ సైతం ఏమీ స్పందించక పోవడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: