సరైన సమయంలో ప్రేమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా గుడ్డిగా ప్రవర్తించి ఉంటే తన జీవితం కూడ ‘మహానటి’ సావిత్రి జీవితంలా మారిపోయి ఉండేదని సమంత మీడియా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ‘మహానటి’ సినిమాలో తాను నటిస్తున్నప్పుడు అందులోని కొన్ని సన్నివేశాలు తన జీవితానికి దగ్గరలో ఉన్నాయి అన్న ఫీలింగ్ కలిగిందని కొన్ని విషయాలలో ముఖ్యంగా ప్రేమ విషయంలో తాను త్వరగా బయటపడకుంటే తన జీవితం మరో సావిత్రి అయి ఉండేది అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసింది సమంత.
samantha-reacts-on-ali-s-lewd-comments
అయితే తాను చేసుకున్న పుణ్యం అదృష్టం వల్ల చైతూ తనకు దొరికాడు అని చెపుతూ అక్కినేని కుటుంబ కోడలుగా తాను అనుభవిస్తున్న హోదాకు చైతూ ప్రేమ మాత్రమే కారణం అంటూ చైతన్య పై తనకు ఉన్న అపారమైన ప్రేమను బయట పెట్టింది. తాను తెలివిగా ఆలోచించి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల తన జీవితం బాగు పడింది అని చెపుతూ తన జీవితంలో చైతూను భాగస్వామిగా ఎంచుకోవడం తన తెలివైన నిర్ణయం అని అంటోంది ఈ గోల్డెన్ లెగ్ బ్యూటీ. 

అంతేకాదు ‘మహానటి’ సావిత్రి లాగ తనను ఎవరైనా ఈపని నీవల్ల కాదు అని అన్నప్పుడు తనకు కసి పెరిగిపోతుంది అంటూ తనను భయపెట్టే పరిస్థుతులు ఎదురైనప్పుడు తనలోని అసలైన నటి బయటకు వస్తుంది అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం స్టార్ పేరు చూసి ధియేటర్లకు వెళ్ళే రోజులు పోయాయని దీనికి కారణం కథ లేకుంటే స్టార్ సినిమాలను కూడ ప్రేక్షకులు తిప్పికొడుతున్న విషయాన్ని గుర్తు చేసింది ఈ అక్కినేని కోడలు. 

ఇక సావిత్రి జీవితంలో తనకు నచ్చిన విషయాల గురించి ప్రస్తావిస్తూ నటిగా చూస్తే ఎంతో ఉన్నత స్థానంలో కనిపించే ఆమె గృహిణిగా ఆమె ఇంకోలా కనిపిస్తారు అంటూ ఆమె దయా గుణం గురించి తెలుసుకుని తాను చెలించిపోయిన సందర్భాన్ని బయట పెట్టింది సమంత. సంతృప్తి అన్నది సంపాదనలో లేదు అని అంటూ మనకు ఉన్నది నలుగురుతో పంచుకోవడంలో వచ్చే ఆనందం ఎంత ఖరీదైన వస్తువును కొనుక్కోవడంలో రాదు అని అంటూ తాను మధ్య తరగతి నుంచి రావడంతో సద్దుకు పోవడం తనకు తెలుసు అని అంటోంది సమంత..



మరింత సమాచారం తెలుసుకోండి: