మూడు దశాబ్ధాల టాప్ హీరో కెరియర్ తో కొనసాగుతున్న నాగార్జునకు ఫెయిల్యూర్స్ కొత్తవి కావు. అయితే వర్మ ‘ఆఫీసర్’ అందించిన పరాభవం నాగార్జున జీర్ణించుకోలేని వాస్తవంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘ఆఫీసర్’ పై నాగ్ కు పెద్దగా అంచనాలు లేకపోయినా కనీసపు కలక్షన్స్ అయినా ఈమూవీకి వస్తాయని ఆశించాడు. ఈసినిమా ప్రమోషన్ విషయమై నాగార్జున విపరీతమైన శ్రద్ధ తీసుకుని అన్నపూర్ణ సంస్థకు సంబంధాలు వున్న బయ్యర్లను రంగంలోకి దింపి ఈ సినిమాను పంపిణీ చేయించినట్లు తెలుస్తోంది. 
 nagarjuna doing soggade chinninayana movie sequel!
అంతేకాదు ఈమూవీ సహ నిర్మాతగా వ్యవహరించిన ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన పది కోట్లు తగాదాను నాగార్జున తన పరపతితో క్లియర్ చేయించి ‘ఆఫీసర్’ ను విడుదల చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో వంద కోట్ల షేర్ సాధించిన సినిమాలున్నాయి. ఏకథాటిగా 50రోజుల పాటు రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సినిమాలున్నాయి. 
Nag To Think Of Retirement After His 100th Film
దీనికి భిన్నంగా నాగార్జున ఆఫీసర్ క్రియేట్ చేసిన మొదటిరోజు రికార్డులను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈమూవీకి మన తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజున పట్టుమని 45లక్షల రూపాయల షేర్ కూడా రాలేదు అన్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. టాప్ హీరోల సినిమాలకు ఫ్లాప్ టాక్ రావడం సహజమే అయినా ఇలాంటి ఘోర పరాజయం ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ టాప్ హీరోకి రాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో నాగార్జునకు ఈమధ్య కాలంలో వచ్చిన హ్యాట్రిక్ ఫెయిల్యూర్ సినిమాగా ‘ఆఫీసర్’ మారింది. 
nagarjuna-akkineni
ఇప్పుడు దీని ప్రభావం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న నాగార్జున నానీల మల్టీ స్టారర్ మార్కెట్ పై తీవ్రంగా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. నాగార్జునకు వరసపెట్టి వస్తున్న పరాజయాలతో పాటు నాని ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ కూడ ఫెయిల్ అవ్వడంతో ఇద్దరు ఫెయిల్యూర్ హీరోలు నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీని మార్కెట్ చేయడానికి నిర్మాత అశ్వినీదత్ చాల తీవ్రంగా కష్టపడవలసి వస్తుంది అని అంటున్నారు. ఏమైనా మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా నాగార్జున తన సినిమా కథల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పెను సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: