అల్లు అర్జున్ అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘నాపేరు సూర్య’ ఇచ్చిన ఫ్లాప్ నుండి ఇంకా బన్నీ తేరుకోలేకపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ అల్లువారి అబ్బాయి తన తరువాత మూవీని ఎలాంటి సబ్జెక్ట్ తో ఎవరి దర్శకత్వంలో నటించాలి అన్న విషయమై విపరీతమైన గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. 
Naa Peru Surya Naa Illu India
అల్లు అర్జున్ ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ఎక్కువగా అతడు చేసిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లు భారీ హిట్స్ గా మారిన నేపధ్యంలో సీరియస్ పాత్రలకు తాను సరిపోనా అన్న అనుమానం ఏకంగా బన్నీకే వచ్చినట్లు టాక్. దీనితో ఈసారి తన పాత దారిలోనే వెళ్లిపోవాలని బన్నీ భావిస్తున్నట్లు సమాచారం. 
Allu Arjun
ఈనేపధ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ తన వద్దకు వస్తున్న రచయితలను దర్శకులను మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్టులను తీసుకురమ్మని చెపుతున్నట్లు టాక్. దీనికికారణం ఈమధ్య కాలంలో ప్రేక్షకులు టాప్ హీరోల సినిమాలలో కూడ ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తున్న పరిస్థుతులు అని తెలుస్తోంది. అయితే బన్నీకి ప్రస్తుతం కథ చెప్పి ఒప్పించడం చాల కష్టమైపోతున్న నేపధ్యంలో స్వయంగా అల్లు అర్జున్ రంగంలోకి దిగి అనేకమంది రచయితలకు దర్శకులకు సంకేతాలు పంపుతున్నా బన్నీ కోరుకునే విధంగా స్పందన రావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. 
allu arjun
మరోవైపు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కూడా అన్నయ్య బాటలోనే పయనిస్తున్నాడు అని తెలుస్తోంది. ‘ఒక్క క్షణం’ లాంటి సీరియస్ మూవీతో ఖంగుతిన్న శిరీష్ మలయాళంలో విజయవంతమైన కామెడీ ఎంటర్టైనర్ ‘ఏబీసీడీ’ రీమేక్ లోనటించబోతున్నట్లు టాక్. అంతేకాకుండా ఇలాంటి కామెడీ రొమాంటిక్ సినిమాల కథలను మాత్రమే తనకు తెచ్చి పెట్టమని శిరీష్ తనతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్న దర్శక నిర్మాతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈవార్తలు ఇలా హడావిడి చేస్తున్న నేపధ్యంలో అల్లు బ్రదర్స్ వ్యూహాలు మారుతున్నాయా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: