చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘సైరా’ షూటింగ్ జరుగుతూ ఉండగానే కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి ‘సైరా’ కోసం ఏర్పరుచుకున్న లుక్ ను టచ్ చేయకుండా ఇంచుమించు అదే లుక్ తో కొరటాల మూవీలో కూడ కనిపిస్తాడని తెలుస్తోంది. 
Koratala-Siva
ఇప్పటికే ఒక సామాజిక కథాంశంతో రూపొందించబడ్డ ఈమూవీ స్టోరీ లైన్ కు చిరంజీవి ఓకె చెప్పడంతో కొరటాల టీమ్ ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం హై పవర్ ఫుల్ సోషల్ డ్రామాగా తీయబోతున్న ఈమూవీలో చిరంజీవి ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది. 

ఈమూవీలో చిరంజీవి నటించే రెండు పాత్రలలో ఒక పాత్ర గ్రామీణ నేపధ్యంలో ఉంటే మరొక పాత్ర అమెరికాలో సెటిల్ అయిన ఒక ఎన్ ఆర్ ఐ బిలియనీర్ పాత్రలో ఉంటుందని తెలుస్తోంది. వైవిధ్యంతో ఉండే ఈరెండు పాత్రలకు చిరంజీవి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండేడట్లుగా కొరటాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
  
koratala siva
మరి కొద్దిరోజులలో స్క్రిప్ట్ పూర్తి అయిన తరువాత ఈసినిమాలోని నటీనటుల ఎంపిక కోసం కొరటాల దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ధనవంతులు పేదవారి మధ్య అంతర్లీనంగా కనిపిస్తున్న తేడాలను హైలెట్ చేస్తూ సమాజంలోని సంపద అందరికీ చెందాలి అన్న సామాజిక ఇతి వృత్తంతో తయారుకాబడుతున్న ఈకథ కొరటాలలోని నిజమైన కమ్యూనిస్టును మరొకసారి తట్టి లేపుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: