భారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగు లో పెద్దగా అవకాశాలు లేదు..కాకపోతే శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న అమర్ అక్భర్ అంటోనీ చిత్రంలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.
Image result for shruti haasan lover
వాస్తవానికి బాలీవుడ్‌, కోలీవుడ్, టాలీవుడ్ వరుసగా నటించిన ఈ అమ్మడు  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చేసిన `కాట‌మ‌రాయుడు` త‌ర్వాత ఆమె మ‌రో తెలుగు సినిమా చేయలేదు. దానికి కార‌ణం ఆమె ప్రేమ‌లో ప‌డ‌డ‌మేన‌ని వార్త‌లు వినిపించాయి. ఇంగ్లండ్‌కు చెందిన మైకేల్ కోర్స‌లేతో శృతి ప్రేమాయ‌ణం సాగిస్తోందని, త్వ‌ర‌లో వారిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని, అందుకే శృతి సినిమాలు త‌గ్గించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా తన ప్రేమ, పెళ్లి గురించి శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... `నేను పెళ్లి చేసుకుంటాన‌ని ఎవ‌రికీ చెప్ప‌లేదు. ప్ర‌స్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయినా నా పెళ్లి గురించి మీకెందుకు? నా త‌ల్లిదండ్రుల కంటే ఇత‌రులే నా పెళ్లి గురించి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు. 
Image result for shruthi hassan hot
ఇతరుల విషయాల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అంత మంచిది కాదని హెచ్చరించింది.  అంతే కాదు పెళ్లి విష‌యంలో నాకు స్వేచ్ఛ ఉంది. నాకు న‌చ్చిన‌పుడు పెళ్లి చేసుకుంటాన‌`ని శృతి స్ప‌ష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: