రజనీకాంత్ ‘కాలా’ ఈవారం విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈసినిమా ప్రమోషన్ నిమిత్తం నిన్న సాయంత్రం పార్క్ హయత్ హోటల్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజినీకాంత్ టాలీవుడ్ టాప్ హీరోల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక చిరంజీవి ఒక బాలకృష్ణ ఒక వెంకటేష్ ఒక నాగార్జున ఎవరికీ వారు ఎవరూ గొప్పవారు కారనీ వారికి వచ్చిన సినిమాల అవకాశాలకు అదృష్టంతో పాటు దేవుడు ఆశిస్సులు కూడ తోడవ్వడంతో వారంతా టాప్ హీరోలుగా మారారని అంటూ కామెంట్స్ చేసాడు రజినీకాంత్.    
ఎవరికీ వారే ప్రత్యేకం
తన కెరియర్ లో తెలుగు తమిళ సినిమాలపై కాన్సట్రేట్ చేయాలా లేదా కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ ఉండిపోవాలా అన్న అయోమయం తనకు ఎన్నో సార్లు వచ్చింది అని చెపుతూ తనను తమిళ ప్రేక్షకులతో సమానంగా అభిమానించిన గొప్ప మనసు తెలుగు ప్రజలది అంటూ తెలుగువారిని ఆకాశానికి ఎత్తేశాడు రజినీ.  తనను దాసరి నారాయణరావు ఒక సొంత బిడ్డలా ప్రేమించిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ దాసరి స్థానాన్ని చేరుకోగల మరొక గొప్ప వ్యక్తి దక్షిణ భారత సినిమా రంగంలో మరెవ్వరూ ఉండరు అంటూ దాసరి పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 
 ఎన్టీఆర్, దాసరిని గుర్తు చేసుకున్న రజనీ
‘కాలా’ కమర్షియల్‌గా కాకుండా ఒక మంచి మెసేజ్ ఉన్న చిత్రం అని చెపుతూ ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ ముంబై ధారావి. అందులో ఉండే మనుషులు, వారి జీవితాల ఎలా ఉంటాయి అనే అంశంపై ‘కాలా' సినిమా ఉంటుంది అన్న విషయాన్ని రజినీకాంత్ బయటపెట్టాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈమూవీ విడుదలకు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఈమూవీ టిక్కెట్స్ కు మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడులో కూడ చెప్పుకోతగ్గ స్పీడ్ లేకపోవడంతో రజినీకాంత్ మ్యానియా
తగ్గిపోయిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తెలుగులో అవకాశాలున్నా తమిళంలో కంటిన్యూ అయ్యాను
దీనికితోడు రజినీకాంత్ కర్ణాటక కావేరీ జలాలపై చేసిన కామెంట్స్ తో కర్ణాటక ప్రాంతంలో ఈమూవీ విడుదలకు విపరీతమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడ ఇప్పటికీ ‘కాలా’ మూవీ పై క్రేజ్ ఏర్పడలేదు ఇలాంటి వ్యతిరేక పరిస్థుతులలో మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘కాలా’ ఏదైనా అద్భుతం జరిగితే మాత్రమే హిట్ అవుతుంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ ‘కాలా’ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: