‘భరత్ అనే నేను’ సూపర్ సక్సస్ తరువాత మహేష్ తన కెరియర్ కు సంబంధించి 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీకి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. మొదట్లో ఈమూవీ కథ ఆస్ట్రేలియన్ టివి సిరీస్ కోసం ఒక న్యూజీలాండ్ రచయిత వ్రాసిన కథను అనుసరిస్తూ వంశీ పైడిపల్లి మహేష్ సినిమాను తీస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. 
Vamsi Paidipally Declares Mahesh Movie is not a remake
అయితే ఆ వార్తలను వంశీ ఖండించి మహేష్ కోసం తన సొంత కథను వ్రాస్తున్నాను అంటూ లీకులు ఇచ్చాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ స్పానిష్ భాషలో నిర్మించిన ‘మోటార్ సైకిల్ డైరీస్’ ను పోలి ఉంటుంది అని అంటున్నారు. 2004 లో విప్లవ యోధుడు ‘చే గువేరా’ జీవితం పై బయోపిక్ గా వచ్చిన స్పానిష్ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలు యధాతధంగా వంశీ పైడిపల్లి మహేష్ సినిమాలో ప్రయోగిస్తున్నట్లు టాక్. 
Che Guevara Latest Wallpapers
పవర్ స్టార్ గా సినిమాలను షేక్ చేసి ప్రస్తుతం రాజకీయ నాయకుడుగా మారిన పవన్ కళ్యాణ్ భావాల పై చే గువేరా ప్రభావం ఉన్న విషయం తెలిసిందే. గతంలో పవన్ నటించిన కొన్ని సినిమాలలో కూడ ఈ విప్లవ యోధుడి స్మరణ చేస్తూ కొన్ని సన్నివేశాలను దర్శకులు క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

అయితే ఆశ్చర్యకరంగా మహేష్ ఇప్పుడు పవన్ భావజాలాన్ని అనుసరిస్తూ నడిచే కథలో హీరోగా మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘శ్రీమంతుడు’ సినిమా దగ్గర నుండి మహేష్ నటించే సినిమాలలో సామాజిక స్ఫూర్తి ఎక్కువగా ఉంటున్న నేపధ్యంలో ఈసారి మహేష్ కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన ఒక విప్లవయోధుడి జీవితం పై నిర్మించిన బయోపిక్ ‘మోటార్ సైకిల్ డైరీస్’ మూవీ ఛాయలు మహేష్ వంశీ పైడిపల్లిల మూవీలో కనిపించబోతూ ఉండటం హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: