తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత రాంగోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఆఫీసర్’.  ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ చిత్రం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.  శివ చిత్రంతో వీరిద్దరి కెరీర్ టాప్ లెవెల్ కి చేరింది.  ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో గోవింద గోవింద, అంతం చిత్రాలు వచ్చినా పెద్దగా హిట్ కాలేదు.  ఈ మద్య రాంగోపాల్ వర్మ తీస్తున్న చిత్రాలు పెద్దగా విజయం సాధించకపోయినా..వర్మతో ఉన్న స్నేహంతో ‘ఆఫీసర్’ చిత్రంలో నటించారు నాగార్జున.
A still from Officer
ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ‘ఆఫీసర్’ చిత్రం మొదటి రోజే డివైడ్ టాక్ రావడం..ఆ తర్వాత కలెక్షన్ల పరంగూ పూర్తిగా నీరు కారిపోవడం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'ఆఫీసర్' సినిమా రైట్స్ కొనుగోలు చేసిన సుబ్రహ్మణ్యం అనే డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నాడు.  ఆఫీసర్ షూటింగ్ సమయంలో తన వద్ద నుంచి వర్మ రూ. 1.30 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నాడని చెప్పారు.
Image result for officer movie distributor subramanyam
ఆపై సినిమా పూర్తి అయినా, ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని అయితే కోర్టుకు వెళితే..మరింత సమయం పడుతుందన్న ఉద్దేశ్యంలో  సినిమా గోదావరి రైట్స్ ఇవ్వాలని అడిగానని, కేవలం గోదావరి రైట్స్ మాత్రమే విడిగా ఇచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసిన వర్మ, ఏపీ రైట్స్ మొత్తం తీసుకోవాలని చెప్పాడని అన్నారు.  తప్పని సరి పరిస్థితిలో తాను మరో రూ. 3.50 కోట్లు చెల్లించి ఏపీలో సినిమాను విడుదల చేశానని, తొలి షో నుంచే మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదని విలపించాడు. లాభాలు వస్తాయని భావించిన చిత్రం భారీ నష్టాలను మిగిల్చిందని, ఆత్మహత్యే శరణ్యమని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: