సాధారణంగా భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రాలంటే ఓ రేంజ్ లో అంచనాలు వేస్తారు అభిమానులు.  తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు, హిందీ భాషల్లోనే కాదు యావత్ భారత దేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో.  కేవలం భారత దేశంలోనే కాదు జపాన్, సింగపూర్, మలేషియా,అమెరికా, చైనా ఇలా వివిధ దేశాల్లో సైతం రజినీకాంత్ కి గొప్ప గుర్తింపు ఉంది.
Related image
అందుకే రజినీ చిత్రం రిలీజ్ అవుతుందంటే..మొదటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగిపోతుంటాయి. కాకపోతే రజనీకాంత్ నటించిన చిత్రాలు గతకొన్ని సంవత్సరాలుగా సూపర్ హిట్ కావడం లేదు కానీ బిజినెస్ లో మాత్రం ఎప్పటికప్పుడు చరిత్ర సృష్టిస్తూనే ఉన్నాయి . ఇక ఒక్క బ్లాక్ బస్టర్ పడితే ఆ సినిమా వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం .
Image result for kaala movie stills
కబాలి అంతగా ఆడకపోయినా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల వసూళ్ల ని సాధించింది. మరోసారి కబాలి దర్శకుడు పా రంజీత్ తో ‘కాలా ’ చిత్రంలో నటించారు రజిని.   ఈ చిత్రం విడుదలకు ముందే 260 కోట్ల బిజినెస్ చేసింది.


ఏరియాల వారీగా కాలా బిజినెస్ ఇలా ఉంది :
తమిళనాడు – 70 కోట్లు
ఏపీ – తెలంగాణ – 33 కోట్లు
కేరళ – 10 కోట్లు
ఓవర్ సీస్ – 45 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 7 కోట్లు
శాటిలైట్ హక్కులు అన్నీ కలిపి – 70 కోట్లు
ఆడియో – 5 కోట్లు
కర్ణాటక – 20 కోట్లు
మొత్తం – 260 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: