తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగార్జున.  ఈ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా హిట్ కాకపోవడంతో కెరీర్ సంక్షోభంలో పడింది.  ఆ సమయంలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాంగోపాల్ వర్మ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ఓ రేంజ్ లో  సెన్సేషన్ హిట్ అయ్యింది.  అప్పటి వరకు తెలుగు తెరపై కనిపించే విలనీజానికి కొత్త భాష్యం పలికించారు. 

తర్వాత తెలుగు తెరపై ఎన్నో మాఫియా, రౌడీయిజానికి సంబంధించిన చిత్రాలు వచ్చాయి.  అప్పటి నుంచి నాగార్జున వెనక్కి తిరిగి చూసుకోలేదు.  ఇక రాంగోపాల్ వర్మ సైతం కామెడీ, హర్రర్, మాఫియా తరహా చిత్రాలతో మంచి ఫామ్ లోకి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత రాంగోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో గోవింద గోవింద, అంతం చిత్రాలు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు.  చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఆఫీసర్’ చిత్రం వచ్చింది.  మొదటి నుంచి ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఆఫీసర్’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 

ఆఫీసర్ చిత్రం ఘోర పరాజయం పొందడంతో ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ లలో జనాలు లేక వెలవెల బోతున్నాయి దాంతో ఆఫీసర్ చిత్రాన్ని తీసి పడేసారు.  తమిళ హీరో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆ సినిమాని వేసుకున్నారు ఆఫీసర్ చిత్ర థియేటర్ వాళ్ళు దాంతో థియేటర్ లు కళకళ లాడుతున్నాయి అలాగే డబ్బులు కూడా వస్తున్నాయి.

నాగార్జున కెరీర్ లోనే పరమచెత్త చిత్రంగా ఆఫీసర్ సరికొత్త రికార్డులు సృష్టించింది . ఇక సినిమా మేకింగ్ అయితే మరీ దారుణం దాంతో నాగార్జున అభిమానులు వర్మ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు అంతేకాదు నాగార్జున ఎందుకు అతడికి ఛాన్స్ ఇచ్చాడని చివరకు హీరో పై కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: