తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రంపై ఇప్పటి వరకు ఎన్నో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై కర్ణాటకలో నిరసనలు మొదలయ్యాయి.  కాగా, రజనీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదల నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతే కాదు జస్టిస్ ఏకే గోయల్, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.
Related image
కేఎస్ రాజశేఖరన్ అనే వ్యక్తి కాలా సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని కోరుతూ పిటీషన్ వేశారు. తన అనుమతి లేకుండానే సినీ ప్రొడ్యూసర్స్ తన వర్క్‌ను కాపీ కొట్టారని పిటీషనర్ వాదించారు. ఈ  చిత్రం స్టోరీలో కొన్ని సీన్స్‌తో పాటు కొన్ని సాంగ్స్ కూడా తాను రాసుకున్నట్లు ఉన్నాయని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Image result for kaala movie
కాగా, ‘ప్రతి ఒక్కరు ఉత్కంఠతో సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. విడుదల విషయంలో మేం జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు’’ అంటూ సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.  మే 16వ తేదీన ఇదే తరహా వేసిన పిటీషన్ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: