సినిమా హీరోల్లో ఎవరి స్థాయి వారికి ఉంటుంది. ఒకరిని మరొకరితో వారి పారితోషికం ఆధారంగా పోల్చటం సిగ్గుమాలిన తనం. ఒకే స్థాయి హీరోలను పోల్చటానికి పోలికలో సామ్యత ఉన్నప్పుడే బాగుంటుందేమోగాని,  టాలీవుడ్ టాప్ హీరోను మిడ్-రేంజ్ హీరోతో అది కూడా పారితోషికం ప్రాధమ్యంగా ఏలా పోల్చుతారు?  
Image result for big boss ntr vs nani
బిగ్-బాస్ షో చేసినందుకుగాను, తనకు గతేడాది బాగానే పారితోషికం రూపంలో గిట్టుబాటు అయిందని, ఎన్టీఆర్ స్వయంగాచెప్పాడు. ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు ₹50 లక్ష లు పారితోషికంగా ముట్టచెప్పారని అన్నట్లు వార్తలున్నాయి. 
Image result for big boss ntr vs nani
ఇప్పుడు, ఒక ఏడాది గడచి పోయింది స్టార్ చానల్ బడ్జెట్లు మారిపోయాయి. ఒక ప్రోడక్ట్ కు పేరొచ్చేసింది. ఆ తరవాత స్థిరపడ్ద ప్రోడక్ట్ పై యాడ్స్ తదితర సంపాదనా పరమైన లెక్కలు మారిపోయాయి. అందుకే కొంతకాలం మిడ్-రేంజ్డ్ హీరో లను ప్రొమోట్ చేస్తే చానల్ కు మరికొంత మిగులు ఆదాయం వస్తుంది, దరిమిలా హోస్ట్ మారి ఎన్టీఆర్ స్థానంలోకి నానిని, తీసుకొచ్చారు. ‘న్యాచురల్ స్టార్’ కు ఒక్కో ఎపిసోడ్ కు ₹10 లక్షలు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట.
Image result for big boss ntr vs nani
మీడియాలో వార్తలు రాసే వారి ఆలోచనలు మారాలి. ఎన్ టీ ఆర్ రేంజ్ నాని కెందుకుఉంటుంది. వంద కోట్ల క్లబ్లో ఉన్న ఎన్ టి ఆర్ తో నానిని పోల్చటం కరక్ట్ కాదు. అలాగే రెమ్యూనరేషన్ బేస్డ్ గా పోలికలు ఉండరాదు. నటన ప్రాతిపదికన సామ్యం చెప్పాలి. ఆ తరవాత నానిలో పరిణితి రావచ్చు. ఎన్టీఆర్ కంటే నాని ఇన్ని రెట్లు తక్కువా?అంటూ కొంతమంది పోలికలు పెడుతున్నారు. ఎన్టీఆర్ కు ఇచ్చిన మొత్తం నానికి ఎందుకు ఇస్తారు? అంతే మొత్తం ఇచ్చేట్లయితే ఎన్టీఆర్ రేంజ్ హీరో కోసమే ప్రయత్నం చేసి ఉండేవారు కదా! ఆతి సాధారణ విషయాన్ని  కూడా సినీ విమర్శకులు మరిచిపోతున్నారు.
Image result for big boss ntr vs nani
ఒకే కార్యక్రమంపై ఇద్దరు కథానాయకులను పోల్చటం లాంటిది చేయడం అంటే, వారు ఆ షోను ఎలా రన్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్ ఎలా డీల్ చేయగలిగారు, అన్న దగ్గర పోలిస్తే అంతో ఇంతో బాగుంటుంది. అయినా, ఎవరు ఎంత తీసుకుంటే మనకెందుకు. వారు తీసుకునే కోట్లలో ఎవరికీ వాటా రాసివ్వరు. ఆడియన్స్ ను ఎంత వరకు ఎంగేజ్ చేయగలిగారు, అనేంత వరకు లిమిట్స్ లో కంటెంట్ రాసుకుంటే, ఆసక్తిగా ఉండడమే కాదు, ఎబ్బెట్టుగా అనిపించడం మానేస్తుంది. పాత్రికేయ ప్రపంచాని కి అవసరం లేదు. అది బడ్జెట్ బేస్డ్ గా టెలికాస్ట్ జాగ్రఫీ ఆధారంగా ఉంటుంది. అది ఒక బిజినెస్ వ్యవహారం. నటులకు లెదా యాంకర్లకు ఎలా హాండిల్ చేశారన్నదే ప్రామాణికం. 

Image result for big boss ntr vs nani

మరింత సమాచారం తెలుసుకోండి: