తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం నిన్న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కబాలి దర్శకుడు పా. దర్శకత్వంలో మరోసారి తెరపై కనిపించారు రజినీ. పొలిటికల్ ఎంట్రీ తరువాత వస్తున్న మూవీ కావడంతో పాటు ఈ చిత్రాన్ని రజినీ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మించడంతో మరింత హైప్ వచ్చింది. 


ఇక ప్రపంచ వ్యాప్తంగా 900పైగా లొకేషన్లలో విడుదలైన ఈ మూవీ తొలిరోజు రజినీ స్టామినాకు తగ్గ వసూళ్లను సాధించలేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతుండగా.. అధికారిక లెక్కలు రావాల్సిఉంది. చెన్నై సిటీలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజున చెన్నైలో 1.76 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి .. మొదటిస్థానంలో నిలిచింది. 


ఇప్పటివరకూ ఈ స్థానంలో 1.52 కోట్ల గ్రాస్ తో విజయ్ 'మెర్సల్' ఉండేది. ఈ రికార్డును 'కాలా' అధిగమించి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా థియేటర్స్ లో అభిమానులు విజిల్స్ కొడుతూ ఉండగానే, రజనీ తన తదుపరి సినిమా షూటింగులో జాయినైపోవడం విశేషం.    ఇక యూఎస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. దాదాపు 300 లొకేషన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించగా.. ఆఫ్ మిలియన్‌ డాలర్లకు చేరువైనట్టు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. 

rajinikanth kaala breaks mersal record

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘కాలా’ ప్రిమియర్ షోస్ ద్వారా $ 450K సాధించినట్టు ట్రేడ్ పండితుడు రమేష్ బాలా ట్వీట్ చేశారు.  ఈ రికార్డును 'కాలా' అధిగమించి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా థియేటర్స్ లో అభిమానులు విజిల్స్ కొడుతూ ఉండగానే, రజనీ తన తదుపరి సినిమా షూటింగులో జాయిన్ అయినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: