విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచింది.  ఒక దశలో చెప్పాలంటే..భారత దేశ వ్యాప్తంగా ఈ చిత్రంపై నిరసనలు వెల్లువెత్తాయి.  ఇందులో కొన్ని సీన్లు కొన్ని వర్గాల వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా చూపించారని ఆరోపణలు వచ్చాయి.  ఏది ఏమైనా విశ్వరూపం రిలీజ్ కావడం మంచి సక్సెస్ కావడం జరిగింది. 
Vishwaroopam 2's trailer to be launched by Aamir Khan
ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘విశ్వరూపం 2 ’ రాబోతుంది..అయితే మొదటి నుంచి ఈ చిత్రానికి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దం అవుతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు భారీగా కమల్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

జూన్ 11వ తేదీన విశ్వరూపం2 సినిమా ట్రైలర్ విడుదల అవుతుంది. హిందీ వెర్షన్ ట్రైలర్‌ను బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్, తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్ ట్రైలర్‌ను శృతిహాసన్ రిలీజ్ చేయనున్నారు అని రాజ్ కమల్ మూవీస్ ట్వీట్ చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: