బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో సైతం తన సత్తా చాటుతుంది. క్వాంటికో, బేవాచ్ లతో అంతర్జాతీయ స్టార్ గా ఎదిగిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 35 ఏళ్ల ప్రియాంకా 25 ఏళ్ల నిక్ తో కలసి ఇటీవలి కాలంలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. 


ఆ మ‌ధ్య ఓ బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వెళ్ళిన వారు రీసెంట్‌గా లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్ హాలీవుడ్‌లో ఉన్న టోకా మెడెరాలో డిన్నర్ డేట్‌కు వెళ్లారు. బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వచ్చినప్పుడే ఈ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తున్నదన్న పుకార్లు వచ్చాయి. ఇక డిన్నర్‌కు వెళ్లడంతో ఆ రూమర్లు నిజమేన‌ని అన్నారు. అంత‌ర్జాతీయ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా తాజాగా అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రియుడితో క‌లిసి మరోసారి కెమెరా కంటికి చిక్కారు.

ఏదో సీరియ‌స్ డిస్క‌ష‌న్ చేస్తూ న‌డుచుకుంటూ వెళుతున్న వీరిద్ద‌రిని కెమెరాలో బంధించారు ఫోటోగ్రాఫర్స్‌. మరోవైపు నిక్ జొనాస్‌, ప్రియాంక చోప్రాలు కలిసి ఓ సినిమా ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు కూడా వెల్ల‌డించ‌నున్నార‌ట‌. హాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక త్వ‌ర‌లో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: