గత మూడు నెలల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నటి శ్రీరెడ్డి విషయాలే చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందని..కొత్తగా వచ్చే అమ్మాయిలతో కొంత మంది దళారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని అలాంటి వారికి బుద్ది చెప్పడానికి తాను ముందుకు వచ్చానని హల్ చల్ చేసింది.  ఫిలమ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో శ్రీరెడ్డి బాగా పాపులర్ అయ్యింది.  ఇక తన పోరాటానికి ఎదురు లేదనుకున్న సమయంలో పవన్ కళ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారే సీన్ రివర్స్ అయ్యింది. 
నానిపై కామెంట్స్
అప్పటి వరకు ఆమెకు సహకరిస్తామని చెప్పిన వారంతా పక్కకు తప్పుకున్నారు. అంతేకాదు మీడియావారు సైతం దూరంగా ఉంటూ వచ్చారు.  దాంతో శ్రీరెడ్డి ఇంటి నుంచే సోషల్ మాద్యమాల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్, దగ్గుబాటి ఫ్యామిలీ, నాని టార్గెట్ గా శ్రీరెడ్డి కామెంట్స్ చేస్తోంది.  ఈసారి బిగ్ బాస్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఆడియన్స్ కు వినోదాన్ని పంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కావలసిన మసాలా ఎలిమెంట్స్ ని దట్టించినట్లు తెలుస్తోంది. 
Image result for big boss 2 telugu
ఈ మద్య శ్రీరెడ్డి బిగ్ బాస్ 2 లో కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే శ్రీరెడ్డి బిగ్ బాస్ లో ఉంటే..వ్యాఖ్యాతగా నానితో ఎలా ఉండబోతుందని కామెంట్స్ వినిపించాయి. 16 మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు 'బిగ్ బాస్ హౌస్'లో ఉండబోతున్నారు. ఈ 16మంది సభ్యుల మధ్య అనునిత్యం చోటుచేసుకునే ఆసక్తికరమైన సంఘటనలతో ఈ షో కొనసాగనుంది. దాంతో బుల్లితెర ప్రేక్షకులంతా ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Image result for big boss 2 telugu
తాజాగా తాను ఈ షోలో లేనని తాజాగా శ్రీ రెడ్డి చెప్పింది. "ఇది నా దురదృష్టం .. నా స్నేహితులకు చేదు వార్త .. నేను 'బిగ్ బాస్ 2'లో పాల్గొనడం లేదు. ఇది నా సన్నిహితులను అప్సెట్ చేసినా, కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. పోటీదారులు అదృష్టవంతులు .. 'బిగ్ బాస్ 2' బృందానికి ఆల్ ది బెస్ట్" అని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.   




మరింత సమాచారం తెలుసుకోండి: