ఈ మద్య స్టార్ హీరోలు సోషల్ మాద్యమాల్లో బాగా యాక్టీవ్ గా ఉంటున్నారు. ఏ చిన్న విషయాన్నైనా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ప్రత్యేక సెలబ్రెషన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మద్య జూనియర్ ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా తమ చిన్నారి అభయ్ రామ్, భార్య ప్రణతి కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసి ఆసక్తికర ట్వీట్ చేశారు.

లక్ష్మి ప్రణతి తన కొడుకు పట్ల ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆమె నుంచి నేను కూడా అభయ్ ని కాపాడలేనని సరదాగా కామెంట్ చేశాడు. ప్రతిరోజు పాలు తాగడానికి చాలా మంది చిన్నపిల్లలు మారం చేస్తుంటారు. కానీ లక్ష్మి ప్రణతి అంత సులువుగా విడిచిపెట్టేలా లేదు. అభయ్ ని కూర్చో బెట్టి మరి పాలు తాగిస్తోంది.

‘అభయ్ రోజూ తాగాల్సిన పాల కోటా విషయంలో వాడిని వాళ్ల అమ్మ నుంచి ఏమాత్రం కాపాడలేం’ అని ఆ ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.కాగా, ఈ ట్వీట్ పై స్పందించిన ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. ‘క్యూట్ నెస్‌ ఓవర్ లోడెడ్’ అంటూ చిన్నారి అభయ్ కి కితాబిచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: