గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న శ్రీరెడ్డి ఇంట్లో నుంచి సోషల్ మాద్యమాల ద్వారా టాలీవుడ్ సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది.  ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని..దాన్ని ఎలాగైనా ఆపుతానంటూ కంకనం కట్టుకున్న శ్రీరెడ్డి కి అందరూ సపోర్ట్ ఇచ్చిన సమయంలో పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై విమర్శలు గుప్పించారు..సపోర్ట్ వెనక్కి తీసుకున్నారు. 

మీడియా కూడా శ్రీరెడ్డిని దూరం చేసింది.  అప్పటి నుంచి ఇంట్లో నుంచి పవన్ కళ్యాన్, దగ్గుబాటి ఫ్యామిలీ, నాని పై సంచలన ట్విట్స్ చేస్తూ వస్తుంది శ్రీరెడ్డి. ఈ మద్య బిగ్ బాస్ 2 సీజన్ మొదలైన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో నాని తనను బిగ్ బాస్ 2 లోకి రానివ్వకుండా చేశాడని నానిపై తిట్ల పురాణం మొదలు పెట్టింది. 

దాంతో నాని దేనికైనా సహనం ఉంటుందని..,శ్రీరెడ్డికి లీగల్ నోటీస్ పంపించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే..తనను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేసినప్పటికీ, దాన్ని నాని అడ్డుకున్నారని శ్రీరెడ్డి చేసిన విమర్శలపై ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసే తెలుగు టీవీ చానల్ 'స్టార్ మా' యాజమాన్యం స్పందించింది.

'బిగ్‌ బాస్‌' 2వ సీజన్ పోటీదారుల గురించి వివరించిన 'స్టార్ మా' వర్గాలు, తాము మొత్తం 125 మంది పేర్లను పరిశీలించామని, వారిలో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని స్పష్టం చేశాయి. పేరును పరిశీలించినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వలేమని, కంటెస్టంట్స్‌ జాబితాలో ఎవరిని ఉంచాలి? ఎవరిని ఉంచవద్దు? అన్న విషయాల్లో నాని ఎప్పుడూ కలుగ జేసుకోలేదని వెల్లడించాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: