సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ ఇప్పుడు జోరు మీద ఉన్నట్టే అనిపిస్తుంది. పా రంజీత్ దర్శకత్వంలో ‘కాబాలి’ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా నటించిన రజినీకాంత్ మరోసారి మాఫియా డాన్ గా 'కాలా'లో రజనీకాంత్ మరో మారు తన విశ్వరూపం చూపించారు. రజనీ లుక్స్ .. ఆయన డైలాగ్స్ .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది.
Rajinikanth's Kaala
వసూళ్ల  విషయంలో పాత రికార్డులను బీట్ చేస్తూ వెళుతోంది.  అభిమానుల విషయంలో దేశంలోనే గాక విదేశాల్లో సైతం రజినీకి కొదవలేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమాకు పట్టం కట్టేస్తారు. అలానే ‘కాలా’ కు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అలా విడుదలయ్యిందో లేదో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.  ఆస్ట్రేలియాలో నిన్నటి వరకూ ఈ సినిమా 2.4 కోట్లను రాబట్టినట్టు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Image result for KAALA MOVIE
ఆస్ట్రేలియాలో తొలివారంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ భారతీయ చిత్రంగా 'కాలా' నిలవగా .. మొదటి స్థానంలో 'పద్మావత్' వుంది.  ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. రానున్న కొద్ది రోజుల్లోనే ‘కాలా’ ఖాతాలో మరిన్ని రికార్డులు పడటం ఖాయం అనేది పలువురు సినీ విశ్లేషకుల మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: