తెలుగు ఇండస్ట్రీలో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా.  అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఇలియానా మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  దాంతో ఈ అమ్మడికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఒక్కసారే చాన్సులు తగ్గిపోయాయి.  బాలీవుడ్ లో అయినా సక్సెస్ అవుతుందా అంటే అక్కడ ఏ మాత్రం క్రేజ్ తెచ్చుకోలేక పోయింది ఇలియానా.  అప్పటి నుంచి తెలుగు లో విపరీతంగా ట్రై చేస్తున్నా ఇలియానాను పట్టించుకున్న నాధుడే లేదు. 
Image result for ileana hot
తెలుగులో మంచి ఫామ్ లోకి వచ్చిన ఇలియానా అనుకోకుండా బాలీవుడు ఎంట్రీ ఇవ్వడంతో..తెలుగు లో యువ హీరోయిన్లు చాలా మంది వచ్చారు..దాంతో ఇలియానాకు చాన్సులు కరువయ్యాయి.  ఇదిలా ఉంటే ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆండ్రూ ని వివాహం చేసుకుంది. తాజాగా ఈ జంట  విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఫొటోలను ఆమె నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. డిప్రిషన్‌, బాడీ ఇమేజెస్‌ సమస్యలపై స్పందించింది.

నటిగా తనకు చాలా బాధ్యతలు ఉంటాయని, తాను కొత్తగా కనిపించాలని అభిమానులు కోరుకుంటారని అన్నది. ఒత్తిడి వల్ల అన్ని వేళలా అందంగా కనిపించడం సాధ్యం కాదేమోనని అంది. 
Image result for ileana boyfriend
ఒకప్పుడు తాను ఎలా ఉన్నా తన అందం గురించి అందరూ రక రకాలుగా అభివర్ణించే వారు..తాను ఇప్పుడు హాట్ గా తయారైనా ఎవరూ పట్టించుకోవడం లేదని తెగ ఫీల్ అవుతుంది ఇలియానా.  తనలా శారీక సమస్యలను ఎదుర్కొన్నా వారి గురించి పట్టించుకోవడం లేదని, ఒక్కో రోజు అందంగా ఉన్నా లోపాలు చూపుతున్నారని వాపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: