‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన మహేష్ గ్రామాలను దత్తత తీసుకోవాలని సందేశాలు ఇచ్చాడు. మహేష్ స్పూర్తితో ఎంతోమంది ఎన్నో గ్రామాలను మన తెలుగు రాష్ట్రాలలో దత్తత తీసుకుని తమతమ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మహేష్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని రెండు కళ్ళ సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడు. 
Mahesh Babu in Bharat Ane Nenu
తెలంగాణలోని సిద్దాపురం గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం గ్రామాలను దత్తత తీసుకున్న  మహేష్ ఆ రెండు గ్రామాలను చెప్పుకోతగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి.  బాబు ఏ మేరకు అభివృద్ది చేసాడన్నదానిపై పలు విమర్శలు వున్నాయి. ముఖ్యంగా  బుర్రిపాలెం విషయంలో మొక్కలకు కంచెలు వేయడానికి పలువురు దాతల సాయం తీసుకున్నాడని వార్తలు వున్నాయి.
Bharat Ane Nenu,mahesh babu, kiara advani, barath ane nenu song com, varathane nenu movie rating, Bharat Ane Nenu full movie online watch free, Bharat Ane Nenu movie heroine, Bharat Ane Nenu song lyrics, Bharat Ane Nenu movie, Bharat Ane Nenu download, Bharat Ane Nenu review, Bharat Ane Nenu songs, Bharat Ane Nenu collection, Bharat Ane Nenu teaser, Bharat Ane Nenu trailer, Bharat Ane Nenu release date, bharat ane nenu box office collection, bharat ane nenu box office
వాస్తవానికి తాను నటించే ఒకొక్క సినిమాకు 20 కోట్ల పారితోషికం తీసుకునే మహేష్ ఇలా దాతల వద్ద డొనేషన్స్ తీసుకోవడం ఏమిటి అంటూ గతంలో విమర్శలు కూడ వచ్చాయి. ఇది ఇలా ఉండగా మహేష్ ఈమధ్య ఒక ప్రముఖ ఫార్మా కంపెనీ నుండి తాను చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం 25 లక్షలు విరాళంగా తీసుకున్నాడు అని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
Mahesh Babu New Latest Stylish ULTRA HD Photos Stills Images Gallery
దీనితో మహేష్ తన పలుకుబడి ఉపయోగించి సేకరించిన విరాళాలతో తాను దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధి ఏమిటి అంటూ విమర్శలు హల్ చల్ చేస్తున్నాయి.  సంపాదించింది ఎంతో కొంత తన ఊరికి ఇవ్వకపోతే లావు అయిపోతారు అని మహేష్ ‘శ్రీమంతుడు’ సినిమాలో డైలాగ్ విసిరాడు. అయితే దీనికి భిన్నంగా మహేష్ కార్పోరేట్ కంపెనీల సహాయంతో సమాజ సేవ చేయడం ఏమిటి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ గాసిప్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: