సినిమా ఇండస్ట్రీలో షకీలా అంటే చాలు హాట్ బాంబ్ అంటారు.  ఒకప్పుడు మాలీవుడ్ లో షకీలా సినిమాలు వస్తున్నాయంటే చాలు స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఏర్పడిందంటే..ఆమె సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవొచ్చు.  కానీ అన్ని సమయాలు ఒకేలా ఉండవు కదా..ముఖ్యంగా స్టార్ జీవితాల్లో కష్టాలు ఏ రకంగా వచ్చి పడతాయో అస్సలు తెలియదు.  గత కొంత కాలంగా షకీలాకు సినిమా చాస్సులు పెద్దగా రావడం లేదు. తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో షకీలాకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 
Image result for shakila sheelavathi
అడల్ట్ మూవీస్ లో ఓ వెలుగు వెలిగిన షకీలా, తన 250వ చిత్రంగా 'శీలవతి' అన్న చిత్రాన్ని నిర్మించగా, అది విడుదలకు ముందే కష్టాల్లో పడింది. ఈ సినిమా టైటిల్ మార్చాలని, అప్పుడే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు స్పష్టం చేయడంతో, అసలు సినిమా కూడా చూడకుండా అభ్యంతరాలు ఎలా చెబుతారని షకీలా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  అసలు సినిమా కూడా చూడకుండా అభ్యంతరాలు ఎలా చెబుతారని షకీలా ప్ర‌శ్నించింది.
Image result for shakila sheelavathi
ఈ సినిమా టైటిల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేది లేదని తేల్చి చెప్పింది.. ఈ సినిమా చూసి అభిప్రాయం చెప్పాలని కోరింది.  అంతే కాదు ఆ సినిమాకు సరైన టైటిల్ అదే అని..టైటిల్ మార్చే ప్రసక్తే లేదని అంటుంది. నా పాత డబ్బింగ్ సినిమాకు కూడా 'శీలవతి' అనే పేరుంది. నా ఫిల్మ్ చూడకుండానే ఈ టైటిల్ సూట్ కాలేదని ఎలా చెబుతారు? నాకు రీజన్ తెలియాలి. మొత్తం పబ్లిసిటీ చేసి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత ఇదేంటి? ఆ టైటిల్ మార్చలేము. ఫిల్మ్ ఓసారి చూసి రీజన్ చెప్పండి" అని షకీలా కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: